ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు హ్యాపీనా..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు హ్యాపీనా.. ఎందుకు అంటే నిన్నటివరకు ఎన్టీఆర్ లుక్ విషయంలో సోషల్ మీడియా కామెంట్స్ చూసి ఆందోళన పడిపోయిన అభిమానులు.. డ్రాగన్ గా ఎన్టీఆర్ ని చూసి సంబరపడిపోతూ పండగ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ మాసివ్ లుక్ తో చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
డ్రాగన్ కోసం ఎన్టీఆర్ భారీగా వెయిట్ లాస్ అవడంతో ఎన్టీఆర్ మొహం సాగిపోయినట్టుగా, పేషేంట్ లా తయారవడంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ లుక్ పై ట్రోల్స్ జరగడం చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ లీన్ లుక్ పై బాగా టెన్షన్ పడ్డారు. కానీ డ్రాగన్ లో ఎన్టీఆర్ ని చూసాక వారు ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా వదిలిన డ్రాగన్ గ్లింప్స్ లో ఎన్టీఆర్ పవర్ ఫుల్ లుక్ చూసుకుని ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు. బర్త్ డే కి పర్ఫెక్ట్ ట్రీట్ అంటూ వారు దర్శకుడు ప్రశాంత్ నీల్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.






































