సీఎం విజయ్ కి కోలీవుడ్ సమస్యల తలనొప్పి

తమిళనాడు రాష్ట్రానికి సీఎం గా ప్రమాణస్వీకారం చేసి వారం రోజులు కూడా కాలేదు. అప్పుడే విజయ్ కు సమస్యలు ఊపిరి సలపకుండా చేస్తున్నాయి. అదేదో తమిళనాడు రాష్ట్ర సమస్యలు అనుకుంటే పొరబాటే హీరో నుంచి పొలిటీషియన్ గా మారిన సీఎం విజయ్ ను ఇప్పుడు కోలీవుడ్ సమస్యలు చుట్టుముట్టాయి.
హీరో విశాల్ దగ్గర నుంచి కమల్ హాసన్ వరకు సీఎం విజయ్ ను కలిసి కోలీవుడ్ సమస్యలును విన్నవించుకుంటూ వినతి పత్రం ఇవ్వడమే కాదు.. విజయ్ తమ సమస్యలు త్వరగా పరిష్కరించాలని, ఆయన కూడా నిన్నటివరకు కోలీవుడ్ హీరోల్లో ఒకరు, ఆయనకు తమ సమస్యలు అన్ని తెలుసు అంటూ విజయ్ ను డిమాండ్ చేస్తున్నారు.
మరి సీఎం గా తమిళనాడు బాధ్యతలు, ఆయా సమస్యలకన్నా ఎక్కువగా విజయ్ కు కోలీవుడ్ సమస్యలే తలనొప్పిగా మారేలా కనిపిస్తున్నాయి. మరి హీరో నుంచి సీఎం అయినా విజయ్ కోలీవుడ్ సమస్యలను ఎలా పరిష్కరిస్తారో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.






































