కరుప్పు షోస్ క్యాన్సిల్ - దర్శకుడు ఎమోషనల్
Karuppu director RJ Balaji breaks down amid releaseఈరోజు మే 14 న విడుదల కావాల్సిన సూర్య కరుప్పు షోస్ క్యాన్సిల్ అయ్యాయి. స్పెషల్ షోస్ కి తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, అసలు స్పెషల్ షోస్ కానీ, మార్నింగ్ నుంచి మిగతా షోస్ కానీ పడలేదు. కరుప్పు నిర్మాతల ఆర్థిక బకాయిలు కరుప్పు కాళ్లకు అడ్డం పడ్డాయి.
ఉదయం నుంచి కరుప్పు షోస్ కోసం ఎదురు చూసిన సూర్య ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతుంటే దర్శకుడు ఆర్ జె బాలాజీ మాత్రం ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకున్నాడు. కరుప్ప విషయంలో ఇలా జరుగుతుంది అనుకోలేదు. నేను నిజంగా క్షమాపణలు కోరుతున్నాను. నేను ఊహించలేదు.
కరుప్పు ఇబ్బందులన్నీ త్వరలోనే తొలగిపోయి.. ఈరోజు సాయంత్రం కల్లా అంతా సర్దుకుని సినిమా థియేటర్లలోకి వస్తుందని ఆశిస్తున్నాను అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు.
Director RJ Balaji issued a video statement after his film Karuppu's release was delayed







































