పనిలో పడిన పవన్
Deputy CM Pawan Back In Action After Surgeryనిన్నటివరకు అనారోగ్య సమస్యల్తో సతమతమవుతూ ఇంటికే పరిమితమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేటి నుంచి పనిలో పడ్డారు. శ్వాస కోశ సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడి హైదరాబాద్ లోని ప్రవేట్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుని ఇంట్లోనే రెస్ట్ తీసుకున్న పవన్ కళ్యాణ్ ని ప్రధాని మోడీ పరామర్శించడం హాట్ టాపిక్ అయ్యింది.
ఇక నేడు గురువారం పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఏపీ కేబినేట్ సమావేశాల్లో పాల్గొనడం ఆయన అభిమానులకు ఊరటనిచ్చింది. పవన్ కళ్యాణ్ కేవలం సైనస్ తోనే కాదు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారంటూ వచ్చిన వార్తలతో ఆయన అభిమానులు కాస్త మధనపడ్డారు.
కానీ పవన్ ప్రస్తుతము ఆరోగ్యంగానే కేబినేట్ సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రధాని మోడీ పిలుపునిచ్చినట్టుగా పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించేందుకు ఆయన కాన్వాయ్ లోని వాహనాలను సగానికి సగం కుదించారు. అలాగే జనసేన పార్టీ బలోపేతానికి పవన్ కళ్యాణ్ తగిన చర్యలు తీసుకోవడానికి నేతలను కలిసి దిశానిర్దేశం చేసారు.







































