Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Karuppu: Suriya and Trisha reported fees for the action fantasy revealed

కరుప్పు : సూర్య-త్రిష పారితోషికం ఎంతంటే ..

Karuppu: Suriya and Trisha reported fees for the action fantasy revealed

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కమెడియన్ ఆర్జే బాలాజీ డైరెక్షన్లో నటించిన కరుప్పు (తెలుగు టైటిల్ వీరభద్రుడు) చిత్రం ఈ నెల 15 న తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళం లోనే కాదు తెలుగులోనూ ఈ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. కొన్నాళ్లుగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న సూర్య కు కరుప్పు హిట్ కంపల్సరీ.

ఈ చిత్రంలో సూర్య కు జోడిగా త్రిష నటించింది. అయితే ఈ చిత్రానికి గాను సూర్య కు నిర్మాతలు రూ.45 కోట్ల భారీ పారితోషికం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాలో సూర్య లాయర్ మరియు లార్డ్ కరుప్పు గా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇక త్రిష కు రూ.5 కోట్ల పారితోషికం ఇస్తున్నట్లుగా తెలుస్తుంది.

కరుప్పు విలన్ పాత్రధారి కి రెండు కోట్ల మేర నిర్మాతలు రెమ్యునరేషన్ చెల్లించినట్లుగా టాక్ వినిపిస్తుంది. కరుప్పు ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక సినిమా రిజల్ట్ ఏమిటి అనేది మరో రెండు రోజులు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది. 
 

Karuppu cast fees