సీఎం విజయ్ పై రజినీకాంత్ షాకింగ్ రియాక్షన్
Rajinikanth Shocking Reaction For Cm Vijayతమిళనాడు సీఎం గా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ బాధ్యతలు చేపట్టినప్పుడు మాత్రమే కాదు ఆయన పార్టీ 108 సీట్లు గెలిచినప్పటినుంచి కోలీవుడ్ నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీ వరకు ప్రముఖులంతా విజయ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సీఎం గా ప్రమాణస్వీకారం చేసాక మిగతా నటుల రియాక్షన్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు.
తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఎయిర్ పోర్ట్ లో కనిపించగానే మీడియా మిత్రులు విజయ్ ముఖ్యమంత్రి కావడంపై మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. దానికి సూపర్ స్టార్ ఎలాంటి సమాధానమిస్తారా అని ఎదురు చూసిన వారిని డిజప్పాయింట్ చేస్తూ.. కేవలం ఒక చిరునవ్వు చిందించి అక్కడ నుంచి వెళ్ళిపోయారు.
మరి పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రావాలనుకున్న రజినీకాంత్ తన ఆరోగ్యం విషయంలో కుటుంబ సభ్యుల సలహా మేరకు ఆ ప్రయత్నాన్ని విరమించుకుని సినిమాలు చేసుకుంటున్నారు. అలాంటి సమయంలో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కొద్ధి కాలంలోనే సక్సెస్ అయ్యి సీఎం అయ్యారు.
విజయ్ సీఎం అయిన అందర్భంగా రజినీకాంత్ నుంచి ఎలాంటి రియాక్షన్స్ రాకపోవడంపై విజయ్ ఫ్యాన్స్ లో రకరకాల ఊహాగానాలు కనిపిస్తున్నాయి.







































