సీఎం గా ప్రజల మనసు గెలుస్తున్న విజయ్
Vijay ordered the closure of 717 Tasmac liquor shopsతమిళనాడు సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన హీరో విజయ్ చాలా త్వరగా ప్రజల మనసుల్లో చోటు సంపాదిస్తున్నారు. ప్రజలు ఇష్టపడే విజయ్ ను సీఎం గా ఎన్నుకున్నారు. పార్టీ పెట్టిన రెండేళ్లకే విజయ్ కు అధికారం అప్పగించారు. అందుకే విజయ్ కూడా వారికి నచ్చినట్టుగా పాలన స్టార్ట్ చేసేవారు.
ముందుగా విజయ్ సీఎం హోదాలో తమిళనాడులోని స్కూల్స్, అలాగే గుడులు, హాస్పిటల్ ఏరియాస్ లో ఉన్న మద్యం దుకాణాలను మూయించారు. తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం దుకాణాలను సీఎం విజయ్ మూయించడంతో ఆయన పై ప్రజలు హర్షద్వానాలు వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు టీవీకే నేతలు ప్రజలు ఇబ్బంది పడేలా బ్యానర్ లు కట్టడం, కటౌట్స్ పెట్టడం చెయ్యొద్దని, రద్దీ ప్రదేశల్లో ఇలాంటివి పెట్టి ఇబ్బందులు పెట్టొద్దని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం విజయ్ అల్టిమేటం జారీ చేసారు. మరి ఇలాంటి చిన్న చిన్న నిర్ణయాలే ప్రజలకు దగ్గర చేసేది, హీరోలను చేసేది.
రీల్ హీరోగానే కాదు అటు రాజకీయాల్లోనూ విజయ్ రియల్ హీరో గా ప్రజల దోచేస్తున్నారు అంటూ తమిళనాడు ప్రజలు మాట్లాడుకుంటున్నారు.







































