హడావిడి మొదలు పెట్టారు

Skanda promotions hungama start

రామ్-బోయపాటి కలయికలో మొదటిసారిగా రాబోతున్న స్కంద మూవీపై అంచనాలు బావున్నాయి. రామ్-బోయపాటి ఇద్దరూ ఈ చిత్రంతోనే తొలిసారిగా ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నారు. అయితే విడుదలకు ఖచ్చితంగా పది రోజులు మాత్రమే సమయం ఉండడంతో రామ్ స్కంద ప్రమోషన్స్ ఇంకా మొదలు పెట్టకపోవడంపై సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. 

వినాయకచవితి స్పెషల్ గా ఈ రోజుకి సినిమా విడుదలకి పది రోజులు ఉంది అంటూ పోస్టర్ తో జాతర మొదలు పెట్టారు మేకర్స్. అటు స్కంద సాంగ్ విడుదల, ఇటు కౌన్ డౌన్ పోస్టర్ అన్ని సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్నాయి. మరి ఈ రోజు నుంచి స్కంద హడావిడి మొదలయ్యింది అని టీమ్ చెప్పకనే చెప్పేసింది. శ్రీలీల హీరోయిన్ గా సాంగ్స్ లో అదిరిపోయే డాన్స్ తో ఆకట్టుకుంటుంది. 

ఇటు రామ్ లుక్స్, బోయపాటి యాక్షన్ అన్ని హైలెట్ అనేలా ఉన్నాయి. అయితే స్కంద ట్రైలర్ విషయంలో బోయపాటి పై పలు విమర్శలొచ్చాయి. ఆయన పాత సినిమాల్లోని కొన్ని బిట్స్ తో స్కంద ట్రైలర్ ఉంది అంటూ కామెంట్ చేసారు. మరి విడుదలకు ముందేమన్నా కొత్త ట్రైలర్ తో ఇంట్రెస్ట్ కలిగిస్తారేమో చూడాలి. 

Ram Skanda countdown poster

ram skanda