న్యూ లుక్ లో కీర్తి సురేష్

Keerthy Suresh in new lookKeerthy Suresh in new look

సినిమా షూటింగ్స్, సినిమా ప్రమోషన్స్ అంటూ ఎంత బిజీగా వున్నా కీర్తి సురేష్ గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటుంది. ప్రమోషన్స్ కోసం చక్కగా రెడీ అయ్యి వెళ్లేముందు ఫొటోస్ తీయించుకోవడమే కాదు.. ఆ ఫోటో షూట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యడమే కాకుండా.. తన పప్పీలతో ఆడుకుంటున్న పిక్స్ ని కూడా షేర్ చేస్తుంది. తాజాగా మామన్నన్ మూవీ ప్రమోషన్స్ లో రకరకాల అవుట్ ఫిట్స్ తో అందంగా తయారై ఆ ఫొటోస్ ని ముందుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఎక్కువగా శారీస్ లోనే కనబడుతున్న కీర్తి సురేష్ తాజాగా బ్లాక్ శారీ లుక్ వదిలింది.

క్రీమ్ కలర్ వెరైటీ బ్లౌజ్ లో బ్లాక్ శారీ లో కీర్తి సురేష్ అదరగొట్టేసింది. కొద్దిరోజులుగా గ్లామర్ గా టర్న్ అయిన కీర్తి సురేష్ అందాలు చూపించడంలో తగ్గేదెలా అంటుంది. శారీ అయినా, గ్లామర్ అవుట్ ఫిట్ ఏదయినా సరే కీర్తి సురేష్ ముందుగా అందాలు చూపించడానికి ప్రిఫరెన్స్ ఇస్తుంది. ప్రస్తుతం తెలుగులో కీర్తి సురేష్ నటించిన భోళా శంకర్ రిలీజ్ అవుతుండగా.. ఆమె తమిళంలో నటించి హిట్ అయిన మామన్నన్ .. తెలుగులో నాయకుడుగా రేపు శుక్రవారం విడుదల కాబోతుంది.

Keerthy Suresh in black saree

keerthy suresh