ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rashmika says she had nightmares after painful trolling

ఆ సినిమా ప్లాప్, నిద్రలో ఏడ్చేదాన్ని: రష్మిక

Rashmika says she had nightmares after painful trolling

రశ్మిక టాలీవుడ్ విజయ్ దేవరకొండ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న గీత గోవిందం ఎంతటి బ్లాక్ బస్టర్ ఇచ్చిందో.. విజయ్ తో జత కట్టిన డియర్ కామ్రేడ్ అంత నిరాశ పరిచింది. ఆ సినిమాలో విజయ్ తో లిప్ లాక్ తో హైలెట్ అయ్యింది రష్మిక. అప్పటినుండి వారి మధ్యన ఏదో ఉంది అంటూ పుకార్లు షికార్లు చేసాయి. అయితే తాజాగా డియర్ కామ్రేడ్ ప్లాప్ అయింది ఒక ఎత్తు, ఆ సినిమా పోవడంతో ఆ సినిమాలో తన లిప్ లాక్ పై వచ్చిన ట్రోల్స్ ఒక ఎత్తు అంటుంది రష్మిక. బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ గుడ్ బై ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డియర్ కామ్రేడ్ లిప్ లాక్ సీన్స్ ట్రోల్స్ ని ఆ రోజుల్లో ఎలా అధిగమించానో నాకే తెలియదు.

నేను చాలా సెన్సిటివ్ పర్సన్ ని. కొంతమంది నాకు ఫోన్ చేసి అంతా బాగానే ఉంది అనేవారు. మరికొంతమంది నన్ను దారుణంగా ట్రోల్ చేసారు. ఈ సమయంలోనే నన్ను మరింత బాధపెట్టే సంఘటనలు చాలా జరిగాయి. నేను ఎవరినో వేడుకుంటున్నట్లుగా కలలు వచ్చేవి, నిద్రలో ఉలిక్కిపడి లేచి ఏడ్చేదాన్ని, రాత్రంతా అలానే ఏడ్చేదాన్ని.. అంటూ తన చేదు అనుభవాలను ఆ ఇంటర్వ్యూలో రష్మిక బయటపెట్టింది.

Rashmika Mandanna opened up about being trolled

rashmika mandanna
vijay deverakonda
dear comrade