కరణ్ జోహార్ వల్ల క్రేజ్ వస్తుందనుకుంటే..!
Karan Johar turns problem to Liger Movieసౌత్ సినిమాకి బాలీవుడ్ అండదండలు ఉంటే ఆ సినిమా నార్త్ లో మంచి ప్రమోషన్స్ చేసుకుని.. అక్కడి ప్రేక్షకులు ఆసక్తితో మంచి హిట్ అవుతుంది అని చాలామంది నమ్ముతారు. అందుకే విజయ్ దేవరకొండ కూడా కరణ్ జోహార్ ని తన ప్రాజెక్ట్ లోకి తీసుకువచ్చాడు. విజయ్ దేవరకొండ తో కరణ్ జోహార్ స్ట్రయిట్ బాలీవుడ్ మూవీ చేద్దామంటే.. దానికన్నా ముందు లైగర్ మూవీ కథ వినిపించి అందులో నిర్మాతగా కరణ్ ని చేర్చాడు. దానితో లైగర్ మూవీకి బాలీవుడ్ లో హెల్ప్ అవుతుంది.. మంచి ఓపెనింగ్స్ దక్కుతాయని విజయ్ దేవరకొండ తో పాటుగా పూరి కూడా అనుకున్నాడు.
కానీ ఇప్పుడు కరణ్ జోహార్ లైగర్ కి హెల్ప్ అవడం అటుంచి.. అతని వల్ల నార్త్ లో ఓపెంగ్స్ దక్కేలా కనిపించడం లేదు. కారణం కరణ్ జోహార్ పై సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటి ఉంది. కరణ్ జోహార్ పై ఉన్న వ్యతిరేఖతని నెటిజెన్స్ లైగర్ మీద చూపించే అవకాశం ఉండడం కాదు, చూపిస్తున్నారు కూడా. లైగర్ మూవీ ని బాయ్ కాట్ చెయ్యాలంటూ #BoyCottLigerMovie హాష్ టాగ్ ని ట్రెండింగ్ లోకి తెచ్చారు. అది కేవలం కరణ్ జోహార్, హీరోయిన్ అనన్య పాండే పై ఉన్న వ్యతిరేఖత కారణంగానే. మరి లైగర్ కి కరణ్ జోహార్ వలన క్రేజ్ వచ్చుద్ది అనుకున్న విజయ్ కి నెటిజెన్స్ షాకిచ్చారు.
Boycottliger Trend Creates Fear in Movie Team






































