ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> R.R.R. Seethamma on the Dabboo Ratnani Calendar

డబ్బూ క్యాలెండర్ పై ఆర్.ఆర్.ఆర్ సీతమ్మ

R.R.R. Seethamma on the Dabboo Ratnani Calendar

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబోలో పాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ షూటింగ్ జులై ఫస్ట్ వీక్ నుండి మొదలు కాబోతుంది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీం గా ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాలో సీత గా అల్లూరి కి పెయిర్ గా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుంది. అలియా భట్ సీత గా చిన్న రోల్ చేస్తున్నా.. ఆమె రోల్ చాలా కీలకం అని ఆర్.ఆర్.ఆర్ రైటర్ చెప్పాక సీత పాత్రపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. సీత గా అలియా భట్ లుక్ కూడా అద్భుతంగా ఉంది. చీర కట్టులో అలియా భట్ సీత గా మెరిసిపోయింది. రాజమౌళి సినిమాల్లో కేరెక్టర్ లుక్స్ కానివ్వండి, వాటి పాత్రలు తీరుతెన్నులు ఎలా ఉంటాయో ఆయన ప్రతి సినిమాల్లో చూస్తూనే ఉన్నాయి

అలాంటి సీతమ్మ బాలీవుడ్ లో బికినీ షోస్ చెయ్యడం చూస్తూనే ఉన్నాము. అలియా భట్ బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ తో మాల్దీవుల్లో బికినీ రచ్చ చూస్తున్నాం. రీసెంట్ గా అలియా భట్ డబ్బూ రత్నాని క్యాలెండర్ పై మెరిసింది. మరి బాలీవుడ్ లో డబ్బూ రత్నాని క్యాలెండర్ అంటే ఎలా ఉంటుందో తెలిసిందే. హీరోయిన్స్ ని రకరకాల ఫోజులతో గ్లామర్ గా గాను, అందంగానూ ఫోటో షూట్ చేస్తారు. బాలీవుడ్ లో డబ్బూ రత్నాని ఫోటో షూట్ కి హీరోయిన్స్ - హీరోస్ కూడా పడిపోతుంటారు. మరి ఈ క్యాలెండర్ లో అలియా భట్.. లూజ్ హెయిర్ తో స్లీవ్ లెస్ ఫ్రాక్ లో అద్భుతమైన ఫోజిచ్చింది. అలియా భట్ క్యాలెండర్ షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Alia Bhatt stuns in blue as she poses for Dabboo Ratnani calendar

alia bhatt
rrr movie
rrr sita as alia bhatt
alia stuns in blue
dabboo ratnani calendar