Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Shashank Khaitan resumes the shoot of Mr. Lele

షూటింగ్స్ తో ఎగ్జైట్ అవుతున్న హీరోయిన్

Shashank Khaitan resumes the shoot of Mr. Lele

గత రెండు నెలలుగా సినిమా షూటింగ్స్ ని పక్కనబెట్టి.. ఇంట్లోనే కూర్చోవాల్సి వచ్చింది. సెకండ్ వేవ్ కారణంగా రెండు నెలల లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన హీరో - హీరోయిన్స్ ఒక్కొక్కరిగా సెట్స్ మీదకి వచ్చేస్తున్నారు. యధావిధిగా తమ తమ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. అందులో బాలీవుడ్ టాప్ లిస్ట్ లో ఉన్న కియారా అద్వానీ కూడా ఉంది. కియారా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్ మూవీస్ తో బిజీగా వుంది. లాక్ డౌన్ తో ఆ మూవీ షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ అవడం, ఇప్పుడు మళ్ళీ మొదలు కావడం జరిగింది. తాజాగా తన కొత్త సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూ కియారా తెగ ఎగ్జైట్ అవుతుంది.

చాలా రోజుల తర్వాత షూటింగ్ లో పాల్గొనడం ఆనందంగా, ఉత్సాహం ఉంది అని.. లాక్ డౌన్ తో ఖాళీగానే కూర్చున్నామని, మళ్ళీ పనిలో పడితే ఆ హ్యాపీనెస్ వేరు అంటుంది కియారా. ముంబై లో ఆంక్షల సడలింపు తో కియారా అద్వానీ మిస్టర్‌ లేలే షూటింగ్ లో పాల్గొంటుంది. విక్కీ కౌశల్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా కీలక పాత్ర పోషిస్తుంది. ముంబై లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ సినిమా షూటింగ్ఫ్ జరుగుతుంది. షూటింగ్ మొదలు పెట్టేముందే మూవీ యూనిట్ మొత్తం వ్యాక్సిన్ వేయించుకున్నారని, ఇలాంటి వాతావరణంలో పని చెయ్యడం సాహసమే అయినా.. అందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లో పాల్గొంటున్నట్టుగా చెబుతుంది కియారా అద్వానీ.

Kiara Advani resumes the shoot of Mr. Lele

kiara advani
movie shootings
lock down
mumbai
maharashtra
resumes the shoot
mr. lele