పవన్ ఏం చేసినా అదో సెన్సేషన్
Whatever Pawan does, it is a sensationసెలబ్రిటీస్ ఏ డ్రెస్ వేశారు. దాని కాస్ట్ ఎంత? ఏ చెప్పులు, ఏ షూస్ వేశారు.. దాని ధర ఎంత? హీరోయిన్స్ ఏ హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నారు. దాని కాస్ట్ ఎంత? అసలు వాళ్ళు బొట్టు పెట్టుకున్నా, ఉంగరం వేసుకున్నా, వాచ్ పెట్టుకున్నా దాన్ని న్యూస్ లా మార్చేస్తుంటారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేలికి ఉన్న నాగ పడగల ఉంగరం ఇప్పుడు టాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో పెద్ద సెన్సేషన్ అయ్యింది. పవన్ కళ్యాణ్ ఎందుకోసం ఆ నాగ అంగుళీకాన్ని ధరించాడు. రాజకీయాల్లో కలిసి రావడం లేదు.. ఇది పెట్టుకుంటే ఫ్యూచర్ బావుంటుంది అని ఎవరైనా చెబితే పవన్ అలా చేసారా? లేదంటే ఆధ్యాత్మికంగా దేవుణ్ణి బాగా నమ్మే పవన్ కి ఈ నాగ అంగుళీకాన్ని పెట్టుకుంటే మంచి జరుగుతుంది అని ఎవరైనా సూచించారా?
అసలు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ సింపుల్ గానే ఉంటారు. ఇప్పుడు ఇలా ఈ ఉంగరాల ధరించడం వెనుక ఏమైనా ఉందా? అంటూ గత రాత్రి వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేతికి ఈ ఉంగరాలు చూసిన దగ్గరనుంది అందరిలో మొదలైన అనుమానం, ప్రశ్నలు. కానీ సమాధానం దొరకడం లేదు. ఎందుకంటే ఈ నాగ అంగుళీకాన్ని ఎప్పుడూ బడితే అప్పుడు, ఫ్యాషన్ కోసం ధరించరు. దానికి ఏదో పెద్ద రీజన్ ఉంటే తప్ప. ఎప్పుడూ సింపుల్ గా కనిపించే పవన్ ఇలాంటివి ధరిస్తే అంతే సెన్సేషన్ అవుతుంది అంటూ పవన్ ఫాన్స్ పవన్ ఉంగరం పెట్టుకోవడం చూసి తెగ ఇదైపోతున్నారు.
Pawan Kalyan at Vakeel Saab pre release event







































