రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి క్రేజీ కండిషన్!
Mithun Chakraborty's Surprising Request to Rajini
సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ బ్లాక్‌బస్టర్ సీక్వెల్ `జైలర్ 2` కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. `జైలర్` కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంలో పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ లెజెండరీ నటుడు మిథున్ చక్రవర్తి ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఆయన ఈ సినిమా అంగీకరించే ముందు పెట్టిన ఓ వింత కండిషన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
తొలుత ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం యూనిట్ మిథున్ చక్రవర్తిని సంప్రదించగా.. ఆయన మొదట సున్నితంగా తిరస్కరించారట. `నేను రజనీకాంత్ సినిమాలో విలనా? ఆయన చేతిలో దెబ్బలు తినాలా? నా వల్ల కాదు బాబోయ్" అంటూ సరదాగా అన్నట్లు రజనీకాంత్ గుర్తుచేసుకున్నారు.
అటుపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేవ్స్ సమ్మిట్ కార్యక్రమంలో రజనీకాంత్, మిథున్ చక్రవర్తులు కలుసుకున్నప్పుడు ఈ సినిమాపై మళ్లీ చర్చ వచ్చింది. రజనీకాంత్ అడిగితే తాను ఈ చిత్రంలో నటించేందుకు సిద్ధమేనని చెప్పిన మిథున్.. తనను హీరో కొట్టకూడదని, అలాగే తుపాకీతో కాల్చకూడదనే ఒకే ఒక్క కండిషన్ పెట్టారట. అలా కండీషన్ల ప్రకారం మిథున్ చక్రవర్తి ప్రాజెక్ట్ లో కి వచ్చారు.
















































