దాదా షూటింగ్ లో మంచు మనోజ్

Dada Shooting Update Dada Shooting Update


నందమూరి నటసింహ బాలకృష్ణ మోకాలి గాయం నుంచి కోలుకుని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ లో రీ జాయిన్ అయ్యారు. నిన్న మంగళవారం నుంచి బాలయ్య మైసూర్ లో జరుగుతున్న కొత్త షడ్యూల్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ షెడ్యూల్ లో దాదా చిత్రంలో బాలయ్య తో తలపడబోతున్న మంచు హీరో మనోజ్ కూడా జాయిన్ అయ్యారు.

దాదా షూటింగ్ విరామ సమయంలో మంచు మనోజ్ తన సతీమణి భూమా మౌనిక మంచు, కుమారుడు ధైరవ్ మరియు కుమార్తె దేవసేన శోభలతో కలిసి మైసూరులోని ప్రసిద్ధ చాముండి కొండలపై వెలసిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మనోజ్ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అనంతరం అమ్మవారి సన్నిధిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు వారికి శేషవస్త్రాలు సమర్పించి, తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు. మంచు మనోజ్ కుటుంబ సమేతంగా రావడంతో ఆలయ ప్రాంగణంలో భక్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వారిని పలకరించేందుకు ఆసక్తి చూపించారు.

Dada Movie