ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> BB10: Shalini and Apoorva fighting over Rohit

BB10: రోహిత్ కోసం గొడవపడుతున్న షాలిని, అపూర్వ

BB10: Shalini and Apoorva fighting over RohitBB10: Shalini and Apoorva fighting over Rohit

 

బిగ్ బాస్ సీజన్ 10 లోకి అగ్నిపరీక్ష లో గెలిచి డైరెక్ట్ గా ఎంటర్ అయిన కామనర్స్ రోహిత్, షాలిని, చరణ్, సృష్టి, అమన్, ఝాన్సీ లలో.. సృష్టి ఎలిమినేట్ అయ్యింది. వైల్డ్ కార్డు ద్వారా అపూర్వ అగ్నిపరీక్ష టీం నుంచి మూడు వారాల తర్వాత హౌస్ లోకి  వచ్చింది. అయితే అపూర్వ వచ్చాక రోహిత్ విషయంలో షాలిని చాలా పొసెసివ్ గా మారిపోయింది.

అపూర్వ కూడా షాలిని, రోహిత్ మాట్లాడుకుంటుంటే మధ్యలోకి రావడం, ముఖేష్ గౌడ్ చిన్నదో వైపు, పెద్దదో వైపు అంటూ అపూర్వ, షాలిని, రోహిత్ లను అనడమే కాదు.. వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగ్ ముఖేష్ తో సారీ కూడా చెప్పించారు. గత వారం ఆటలో షాలిని, అపూర్వ చాలా పెద్దగా గొడవ కూడా పడ్డారు.

అయితే ఈరోజు ఎపిసోడ్ లో రోహిత్ విషయంలో షాలిని, అపూర్వలు గొడవపడటం చూసిన వారు రోహిత్ కోసం ఈ ఇద్దరమ్మాయిలు పడి చస్తున్నారురా, లేదంటే కొట్టుకునేవరకు ఎందుకు వెళతారంటూ కామెంట్లు పెడుతున్నారు. అపూర్వ మాట్లాడుతూ నేను వచ్చాక కాస్త ఫియర్ అవుతున్నారు అనుకున్నాను అంటే వచ్చిన వెంటనే ఎవరూ నీతో రాసుకుపూసుకు తిరిగరు అంది షాలిని.

దానికి నీ పేరే తియ్యలేదు అంది అపూర్వ. అగ్నిపరీక్ష టైం లో నేను క్లోజ్ కదా, షాలిని కన్నా ముందు అని అపూర్వ అనింది అన్నాడు రోహిత్. దానితో షాలిని రెచ్చిపోయింది. వాడు నేను క్లోజ్ అన్న తర్వాత, నేను ముందు క్లోజ్ అని ఎలా అంటావ్ అంటూ అపూర్వ తో షాలిని గొడవపడిన ప్రోమో హైలెట్ అవుతుంది. 

Bigg Boss 10 Telugu: Apoorva Shalini Fight About Rohit