ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rajinikanth Biopic: Rishikanth Eyed for Superstar’s Role

ర‌జ‌నీకాంత్ జీవితంలో రిషికాంత్!

Rajinikanth Biopic: Rishikanth Eyed for Superstar’s RoleRajinikanth Biopic: Rishikanth Eyed for Superstar’s Role



సూపర్‌స్టార్ రజనీకాంత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కబోయే బయోపిక్‌లో ఆయన పాత్ర కోసం యువ నటుడు రిషికాంత్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రజనీకాంత్ సినీ ప్రయాణం, ఆయన వ్యక్తిగత జీవితంలోని అరుదైన కోణాలను ఆవిష్కరించే  అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పట్ల సినీ వర్గాల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పాత్రకు ఏ నటుడు సరైన న్యాయం చేయగలడనే చర్చ నేప‌థ్యంలో రిషికాంత్ పేరు పరిశ్రమలో ప్రధానంగా తెరపైకి రావడం గమనార్హం.

సూపర్‌స్టార్ తనయ, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ ఈ బయోపిక్ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. రజనీకాంత్ మేనరిజమ్స్, ఆయనలోని ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్‌ను , ఆ పాత్రకు తగిన ఇంటెన్సిటీని రిషికాంత్ అద్భుతంగా తెరపైకి తీసుకురాగలరని సౌందర్య ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం ఆయన లుక్ టెస్టులు కూడా నిర్వహించనున్నారని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కోలీవుడ్ వ‌ర్గాలు కోడై కూస్తున్నాయి.

రజనీకాంత్ లాంటి లెజెండరీ నటుడి బయోపిక్‌లో నటించడం ఏ నటుడికైనా గొప్ప మైలురాయి లాంటిది. రిషికాంత్ ఈ ప్రాజెక్ట్‌ను దక్కించుకుంటే అది ఆయన కెరీర్‌‌లోనే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. తలైవా అభిమానుల అంచనాలను అందుకొంటూ సౌందర్య అంచనాలకు తగ్గట్టుగా రిషికాంత్  బయోపిక్‌లో ఎలా? మెప్పిస్తారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

Rajinikanth’s Biopic: Rishikanth Reportedly in the Race