`రామాయణం` పై సీఎంగారి నమ్మకం ఏ రేంజ్ లో అంటే?
Ramayana - CM's Oscar Prediction Sparks Fresh Buzz
నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న `రామాయణం` చిత్రంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన అంచనాలను వ్యక్తం చేశారు. ఈ చిత్రం ఈ దశాబ్దానికి చెందినది మాత్రమే కాదని ఇది సహస్రాబ్ది చిత్రంగా నిలుస్తుందని అభివర్ణించారు. ఈ భారీ ప్రాజెక్టుకు అకాడమీ అవార్డు రాకపోతే చాలా నిరాశ చెందుతానని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
భారతదేశం ఎంతో ప్రాచీనమైన కథా సంప్రదాయాలకు నిలయమని ఫడ్నవీస్ పేర్కొన్నారు. మన కళలు, నాటకం , సంగీతం కాలంతో పాటు పరిణామం చెందుతున్నాయని తాజా సాంకేతికతను జోడించి కథలను చెప్పే విధానం రాబోయే తరాలకు ఎంతో స్ఫూర్తినిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ భారీ ప్రాజెక్ట్ గ్లోబల్ స్థాయిలో ఉత్తమంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రెండు భాగాలు గా తెరకెక్కుతోన్న `రామాయణం` మొదటి భాగం నవంబర్ లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ భాగం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ప్రస్తుతం రెండవ భాగం షూటింగ్ జరుగుతోంది. మొదటి భాగం రిలీజ్ తో సంబంధం లేకుండా రెండవ భాగాన్ని పట్టాలెక్కించారంటే మేకర్స్ కంటెంట్ పై ఎంత ధృమగా ఉన్నారో అర్దమవుతుంది. సాధారణంగా మొదటి భాగం ఫలితం చూసుకుని రెండవ భాగాన్ని తెరకెక్కించాలా? లేదా? అన్నది డిసైడ్ అవుతుంది. కానీ అందుకు భిన్నంగా నితీష్ ముందుకెళ్తున్నారు.







































