ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Raveena Tandon attended the Ohh My Dog screening

కుక్క‌ల‌తో ఫోటోల‌కు ఫోజులిచ్చిన సీనియ‌ర్ బ్యూటీ!

Raveena Tandon attended the Ohh My Dog screeningRaveena Tandon attended the Ohh My Dog screening

ఇటీవల ముంబైలో  పంకజ్ త్రిపాఠి నటించిన `ఓహ్ మై డాగ్` సినిమా ప్రత్యేక ప్రదర్శన  కార్యక్రమం  ఘనంగా జరిగిన సంగ‌తి తెలిసిందే. ఈవెంట్‌కు బాలీవుడ్ ప్రముఖులతో పాటు నటి రవీనా టండన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన ఊహించని సంఘటన సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన కుక్కలతో రవీనా టండన్ ఎంతో ఆప్యాయంగా ఫొటోలకు ఫోజులు ఇచ్చారు.

అయితే ర‌వీనా  దిగి లేచే సమయంలో ఆ శునకాలలో ఒకటి అకస్మాత్తుగా గట్టిగా అరవడం ప్రారంభించింది. ఆ సమయంలో రవీనా ధరించిన దుస్తుల కొంగు ఆ కుక్క నోటికి తగలుకోవడంతో అది  దూకుడుగా ప్రవర్తించింది. సాధారణంగా ఇలాంటి  అనూహ్య పరిణామాలు ఎదురైనప్పుడు సెలబ్రిటీలు ఆందోళన చెందడం ..భయపడటం సహజం. కానీ రవీనా టండన్ మాత్రం ఏమాత్రం కంగారు పడకుండా  సంయమనాన్ని ప్రదర్శించారు.

ఆ పరిస్థితిని ప్రశాంతంగా ఎదుర్కొన్న ర‌వీనా  కుక్కను భయపెట్టకుండా దానిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఆ సంఘటన తర్వాత మీడియాతో మాట్లాడిన రవీనా, అది తనపై చేసిన దాడి కాదని అక్కడ మరో కుక్క రావడంతో  ఉత్సాహంతో అలా స్పందించిందని స్పష్టం చేశారు. జంతువులపై ఆమెకు ఉన్న నిజమైన ప్రేమను,  పరిపక్వతను ఈ ఘటన మరోసారి నిరూపించింది.
 

Raveena Tandon posing with a dog