రామ్ చరణ్ కోసం ఎన్టీఆర్ భామ
Ram Charan to romance Sandalwood Seductress
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ చిత్రంలో నటిస్తున్న కన్నడ భామ రుక్మిణి వసంత్ పేరు ఇప్పుడు పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో వినిపిస్తుంది. అది కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది తర్వాత చెయ్యబోతున్న RC 17 చిత్రం కోసం చరణ్ కు జోడిగా రుక్మిణి వసంత్ పేరు తెరపైకి వచ్చింది.
ప్రస్తుతం మణికట్టు సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న రామ్ చరణ్ ఎనిమిది వారాలు అంటే రెండు నెలల తర్వాత సుకుమార్ తో కలిసి RC 17 సెట్ లోకి వెళతారని తెలుస్తుంది. సుకుమార్ కూడా పుష్ప 2 తర్వాత కూల్ గా RC 17 స్క్రిప్ట్ పైనే ఉన్నారు. ఆయన ప్రీ ప్రొడక్షన్ కూడా చరణ్ విశ్రాంతి లోపు పూర్తవుతుంది.
నవంబర్ లేదా డిసెంబర్ నుంచి రామ్ చరణ్-సుకుమార్ కలయికలో RC 17 చిత్రం రెగ్యులర్ షూట్ కి వెళుతుంది అని తెలుస్తుంది. ఈ చిత్రంలోకి పాన్ ఇండియా భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా అనుకుంటున్నారట. అదే నిజమైతే ఎన్టీఆర్ తర్వాత వెంటనే రుక్మిణికి చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ దక్కినట్టే.







































