నిఖిల్ స్వయంభు ఏమైపోయింది
Whats Happening with Nikhil Swayambhuకుర్ర హీరో పాన్ ఇండియా హిట్ కొట్టాక ఆ క్రేజ్ ని మరో పాన్ ఇండియా మూవీ కి ఉపయోగించుకోలేకపోవడం ఆశ్చర్యంగా మారింది. కార్తికేయ 2 తో పాన్ ఇండియా మర్కెట్ లో బలమైన ముద్ర వేసిన నిఖిల్ లేటెస్ట్ మూవీ స్వయంభు మాత్రం విడుదల విషయంలో నలిగిపోతుంది. రిలీజ్ డేట్ ఇవ్వకుండా మేకర్స్ సైలెంట్ అయ్యారు.
స్వయంభు ఓటీటీ డీల్ పూర్తి కాపోవడంతో స్వయంభు మేకర్స్ థియేటర్స్ లో సినిమా విడుదల చేస్తే ప్రాబ్లెమ్ అవుతుంది అని వారు స్వయంభు విడుదల తేదీ ఇవ్వట్లేదు. స్వయంభు నిర్మాతలు కోట్ చేసిన అమౌంట్ కి ఏ ఓటీటీ సంస్థ సుముఖంగా లేకపోవడంతో స్వయంభు విడుదల విషయంలో మేకర్స్ తర్జనభర్జన పడుతున్నారు.
ఇదిగో అదిగో అంటున్నారు కానీ స్వయంభు విడుదల తేదీ బయటపడడం లేదు. ఆగస్టు అన్నప్పటికి.. ఇప్పుడు నిఖిల్ స్వయంభు అనుకోకుండా దసరా బరిలోకి వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు అంటున్నారు. అది కూడా ఓటీటీ డీల్ పూర్తయితేనే. నిఖిల్ కూడా స్వయంభు విషయంలో సైలెన్స్ ని మైంటైన్ చెయ్యడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది.








































