అసలు ఆ ఉద్దేశ్యమే లేదు-సురేఖావాణి

Surekha vani on her second marriageSurekha vani on her second marriage


నటి సురేఖ వాణి తన భర్త అనారోగ్య కారణాలతో కన్నుమూసిన తర్వాత కూతురు సుప్రీత తో కలిసి అందం విషయంలో పోటీపడడమే కాదు, క్లబ్బులు, పబ్బులు, పార్టీలు అంటూ తెగ తిరగేస్తుంది. కూతురు తో కలిసి సురేఖ వాణి చెలరేగిపోతుంది. అది చూసిన వారంతా సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకుంటుంది అనే ప్రచారం మొదలయ్యింది.

కుమార్తె సుప్రీత కూడా తన తల్లి రెండో పెళ్లి చేసుకుంటే తప్పేమిటి అని ప్రశ్నించడంతో సురేఖ వాణి ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటుంది అని చాలామంది అనుకున్నారు. సోషల్ మీడియాలోనూ అదే ప్రచారం జరుగుతుంది. తాజాగా తన రెండో పెళ్లి వార్తలకు నటి సురేఖ వాణి ఫుల్ స్టాప్ పెట్టింది.

ప్రస్తుతానికి నాకు రెండో పెళ్లి చేసుకునే ఆలోచనలు, అలాంటి ప్రణాళికలేవీ లేవు, ఫ్యూచర్ లో కూడా ఉంటాయని నేను అనుకోవడం లేదు. నా కూతురి సుప్రీత కి పెళ్లీడు వచ్చేసింది. నేనెందుకు ఇప్పుడు పెళ్లికి రెడీ అవ్వాలి, అయినా మీడియా ఎప్పుడో నాకు పెళ్లి చేసేసింది కదా. ఇప్పటికే నా పెళ్లి గురించి ఎన్నో వార్తలు గుప్పించేవారు అంటూ సురేఖ వాణి తన రెండో పెళ్లిపై పూర్తి క్లారిటీ ఇచ్చింది.

Surekha vani Opens up on second marriage