ఆ ముగ్గురికి దుల్కరే దిక్కు
Flop Heroines Pinning hopes on Dulquer
ఓ ముగ్గురు ప్లాప్ హీరోయిన్స్ కి ఒకే ఒక్క హారో దిక్కయ్యాడు. ఆ ముగ్గురు హీరోయిన్స్ కి హిట్ ఇచ్చే బాద్యతను మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తీసుకున్నాడు. ఆ ముగ్గురు ఎవరంటే.. ఒకరు పూజ హెగ్డే, మరొకరు శృతి హాసన్, ఇంకొకరు కాయదు లోహర్. పూజ హెగ్డే సెకండ్ ఇనింగ్స్ లో చాలా సినిమాలు డిజప్పాయింట్ చేసాయి.
ఎన్నో హోప్స్ పెట్టుకున్న జన నాయగన్ రీసెంట్ గా పూజ హెగ్డే కి షాకిచ్చింది. దుల్కర్ తో పూజ హెగ్డే తెలుగు ప్రాజెక్ట్ శ్రీ శ్రీ చేస్తుంది. ఈచిత్రం పైనే అమ్మడు ఆశలు పెట్టుకుంది. ఇక కోలీవుడ్ హీరోయిన్ శృతి హాసన్ సెకండ్ ఇన్నింగ్స్ లో కిందా మీదా పడుతుంది.
శృతి హాసన్-దుల్కర్ కలయికలో ఆకాశంలో ఓ తార సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో శృతి హాసన్ కీ రోల్ ప్లే చేస్తుంది. రీసెంట్ గా హిట్ మూవీ డెకాయిట్ నుంచి శృతి తప్పుకోవడం ఆమెకు మైనస్ అయ్యింది. ఇప్పుడు దుల్కర్ నే నమ్ముకుంది ఈ తార.
ఇక మూడో హీరోయిన్ కాయదు లోహర్. కాయదు లోహర్ రీసెంట్ గా ఇదయం మురళి తో హిట్ కొట్టినా ఆ చిత్రం తెలుగులో ఆడలేదు. అందుకే దుల్కర్ తో చేస్తున్న పాన్ ఇండియా ఫిలిం ఐ యామ్ గేమ్ తో మలయాళంలోనూ ఆమె స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలనుకుంటోంది. ఓనమ్ పండుగకు ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ కాబోతుంది.
మరి స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఈ ముగ్గురు భామల్లో ఎవరికి హిట్టు అందిస్తాడో ఈ ఏడాదిలోనే తేలిపోతుంది.








































