ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Chiru158 Shoot Progresses At A Brisk Pace

ChiruBobby2 లో భారీ యాక్షన్ సీక్వెన్స్

Chiru158 Shoot Progresses At A Brisk Pace

'వాల్తేరు వీరయ్య' భారీ విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి మళ్లీ కలిసి పనిచేస్తున్న చిత్రం #ChiruBobby2 / #Chiru158.  ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో విస్తృతంగా జరుగుతోంది.

ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్లు రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్న భారీ యాక్షన్ సన్నివేశం ఈ చిత్రంలో మేజర్ హైలెట్స్ లో ఒకటి. భారీ సంఖ్యలో ఫైటర్లతో అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సన్నివేశం, మెగాస్టార్ చిరంజీవిని పవర్ ఫుల్ , డైనమిక్ అవతార్‌లో ప్రజెంట్ చేయనుంది. అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించేలా రూపొందుతున్న ఈ యాక్షన్ ఘట్టంలో, మెగాస్టార్ స్వయంగా పాల్గొంటూ చాలా సాహసోపేతమైన స్టంట్స్ చేస్తున్నారు.

అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన 'టైటిల్ టీజర్'ను విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నద్ధమవుతోంది.

ChiruBobby2 Shoot Progresses At A Brisk Pace In Hyderabad