ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nagarjuna Speech at Lenin Pre-Release Event

మనవాడు కొడుతున్నాడు - నాగార్జున

Nagarjuna Speech at Lenin Pre-Release Event

 

నిన్న ఆదివారం తిరుపతిలో అఖిల్ లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను గ్రాండ్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి కింగ్ నాగార్జున గెస్ట్ గా హాజరయ్యారు. లెనిన్ పై నాగార్జున చాలా కన్ఫడెంట్ గా ఉన్నారు. అభిమానులకు జులై 10 న మనవాడు కొడుతున్నాడు అంటూ వాళ్లలో ఉత్సాహాన్ని నింపారు.

ఈవెంట్ లో  నాగార్జున మాట్లాడుతూ.. నందు ముందుగా శ్రీరామపురంలో జరిగే కథ అని చెప్పారు. నాన్న గారు శ్రీరామపురంలో అనే ఊర్లోనే పుట్టారు. నందు చెప్పిన కథ నాకెంతో నచ్చింది. ప్రతీ పాత్రలో రకరకాల కోణాలున్నాయి. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టుల్ని ఎవ్వరూ ఊహించలేరు. ప్రేమ కోసం రాజ్యాలు కూలిపోయాయి.. యుద్దాలు జరిగాయి.. లెనిన్ లోనూ ఓ ప్రేమ కథ ఉంది. భారతి (భాగ్యశ్రీ బోర్సె) కోసం ఎన్ని యుద్ధాలైన చేయొచ్చు. భారతికి ఈ సినిమాకి హార్ట్ బీట్‌లాంటిది.

శివాజీ, బ్రహ్మాజీ ఈ చిత్రంలో పాత్రలను పోషించడం ఆనందంగా ఉంది. సునీల్‌తో కలిసి ఎన్నో సినిమాలు చేశాను. ‘లెనిన్’ మీద ప్రేమతో వీరంతా చాలా కష్టపడ్డారు. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నవీన్ ఎడిటింగ్, బ్రిట్టో కెమెరావర్క్ అద్భుతంగా ఉంటుంది. చింటు అన్న‌(నాగవంశీ)కి మాస్ పల్స్ గురించి తెలుసు (నవ్వుతూ). చింటుకి ఈ మూవీ ఉన్న నమ్మకంతో ఏపీ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ‘లెనిన్’ ఈ సీమ కథ, సీమ మట్టి కథ, సీమలో ఉన్న మనుషుల కథ, సీమలో జరుగుతున్న మహా భారతం.

అఖిల్ ఇలాంటి కథకు సూట్ అవుతాడా? అని మొదట్లో చాలా భయపడ్డాను. కానీ సినిమా చూశాక అందరూ ఆశ్చర్యపోయారు. అఖిల్ కనిపించలేదు.. లెనిన్ మాత్రమే కనిపించాడు. లెనిన్ ప్రేమను, పగను ప్రేమిస్తారు.. లెనిన్‌ను ఇంటికి తీసుకు వెళ్తారు. మనందరికీ ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి.. ఈ ప్రేక్షక దేవుళ్లు సాక్షిగా చెబుతున్నాను.. జూలై 10 వస్తున్నాం.. మనవాడు కొడుతున్నాడు’ అని అన్నారు.

Nagarjuna Akkineni Speech at LENIN Grand Pre Release Event