ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> A mind-blowing twist behind Prabhas kalki look

ప్రభాస్ ఖాకీ గెటప్ వెనుక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్

A mind-blowing twist behind Prabhas kalki lookA mind-blowing twist behind Prabhas kalki look

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సినిమా అంటేనే థియేటర్లలో ఒక రకమైన వైల్డ్ ఎనర్జీ ఊగిస్తుంది. ఇక ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్‌తో  `స్పిరిట్` మూవీ చుట్టూ ఇండస్ట్రీని షేక్ చేసే సంగ‌తులపై చ‌ర్చ సాగుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ కేవలం ఖాకీ యూనిఫామ్ వేసిన పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా మాత్రమే కనిపిస్తారని అందరూ ఫిక్స్ అయిపోయిన వేళ.. కథను ఊహించని మలుపు తిప్పే ఒక మైండ్ బ్లాంక్ ట్విస్ట్‌ను వంగా ఇంటర్వెల్ బ్లాక్‌లో సెట్ చేశాడట.

ప్ర‌స్తుతం అదిరిపోయే యాక్ష‌న్ బ్లాక్ చిత్రీక‌ర‌ణ కోసం హైదరాబాద్‌లో కళ్ళు చెదిరే భారీ సెట్స్ వేస్తుండగా.. ఏకంగా 100 మంది అంతర్జాతీయ ఫైటర్లతో ప్రభాస్ చేసే మ్యాసివ్ మాస్ యాక్షన్ సీక్వెన్స్ ఇండియన్ స్క్రీన్ పైనే వన్ ఆఫ్ ది బెస్ట్ హైలైట్‌గా నిలవబోతోంది. ఈ ఊచకోత షెడ్యూల్ ముగిసిన వెంటనే ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా డైరెక్ట్‌గా క్లైమాక్స్ వార్‌ను కూడా షూట్ చేయబోతుండటం విశేషం.

ప్రభాస్- తృప్తి డిమ్రి కాంబోలో టి-సిరీస్ నిర్మిస్తున్న ఈ తెలుగు-హిందీ యాక్షన్ థ్రిల్లర్ ఫస్ట్ లుక్ వచ్చి చాలా కాలం కావడంతో.. అసలు వంగా ప్రమోషన్స్ జోరు ఎప్పుడు పెంచుతాడా అని గ్లోబల్ వైడ్‌గా ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే 2027 మార్చి 5న సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో.. ఈలోగానే  ప్రభాస్ బర్త్ డే (అక్టోబర్ 23) సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోంది. ఈ పుట్టినరోజున `స్పిరిట్` నుండి రానున్న‌ అఫీషియల్ టీజర్ లేదా గ్లింప్స్ అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

బాహుబలి, కల్కి చిత్రాలతో బాక్సాఫీస్‌ను శాసించిన రెబల్ స్టార్‌ను సందీప్ వంగా ఏ రేంజ్ వైల్డ్ కాప్‌గా చూపించబోతున్నాడో హింట్ ఇచ్చే ఆ క్రేజీ రోరింగ్ అప్‌డేట్ కోసమే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఈగర్‌గా వెయిట్ చేస్తోంది.

Spirit - Huge Buzz On Prabhas' New Look