Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Promo Of The Biggest Special Song Hellallallo From Peddi

పెద్ది - హెల్లాల్లో సాంగ్ ప్రోమో

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా 'పెద్ది' దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది.

ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, ఈరోజు చిత్ర బృందం మూడవ సింగిల్ 'హెల్లాల్లో' ప్రోమోను విడుదల చేసింది. ప్రోమో చూస్తుంటే ఇటీవలి కాలంలో వచ్చిన అత్యంత ఎనర్జిటిక్, కలర్‌ఫుల్ స్పెషల్ సాంగ్స్‌లో ఒకటిగా నిలవనుందని అర్థమవుతోంది. పవర్ ఫుల్ డ్రమ్ బీట్స్, క్యాచీ రిథమ్, జాతర వాతావరణాన్ని తలపించే ట్యూన్‌తో పాట ప్రేక్షకులను వెంటనే ఆకట్టుకుంటోంది.

ఈ పాటలో రామ్ చరణ్ తన రగ్గ్డ్, స్టైలిష్ లుక్‌లో అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకుంటున్నారు. ఆయనతో పాటు శ్రుతి హాసన్, జాన్వీ కపూర్ కూడా అలరించారు. శ్రుతి హాసన్ తన బోల్డ్ అటిట్యూడ్‌తో, జాన్వీ కపూర్ తన గ్రేస్‌ఫుల్ ఎనర్జీతో పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముగ్గురి స్క్రీన్ ప్రెజెన్స్ కలిసి ఈ పాటను మరింత గ్రాండ్‌గా మార్చింది.

పూర్తి పాటను రేపు భోపాల్‌లో జరగనున్న భారీ మ్యూజికల్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు. ఈ వేడుకలో ఏఆర్ రెహమాన్, ఆయన బృందం ఈ పాటను ప్రత్యక్షంగా ప్రదర్శించనుండటంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.

 

Peddi Movie,Promo Of The Biggest Special Song Hellallallo From Peddi