Advertisement

ప్రభాస్ స్పిరిట్ లుక్ లీక్


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - కల్ట్ డైరెక్టర్ సందీప్ వంగ కలయికలో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న చిత్రం స్పిరిట్. స్పిరిట్ షూటింగ్ మొదలు పెట్టిన చాల తక్కువ సమయంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఫస్ట్ లుక్ రివీల్ చేసిన వంగ.. ప్రస్తుతం సైలెంట్ గా ప్రభాస్ తో స్పిరిట్ షూటింగ్ చేసుకుంటున్నారు.

హైదరాబాద్ లోని కొంపల్లి పరిసరాల్లోప్రాంతాల్లో స్పిరిట్ షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్పిరిట్ సెట్ నుంచి ప్రభాస్ పోలీస్ లుక్ లీక్ అవగా.. తాజాగా స్పిరిట్ స్పాట్ నుంచి ప్రభాస్ ట్రెడిషనల్ లుక్ లీక్ అవడం అభిమానులను హ్యాపీ చేసినా మేకర్స్ కి షాకిచ్చింది.

స్పిరిట్ స్పాట్ నుంచి లీకైన లుక్ లో ప్రభాస్ వైట్ పంచెకట్టు, పొడవాటి ఉంగరాల జుట్టుతో, స్టైలిష్ గా సన్ గ్లాసెస్ పెట్టుకుని, గన్ చేతిలో పట్టుకుని నడుచుకుంటూ వస్తున్నారు. పక్కనే సెక్యూరిటీ, క్రూ మెంబర్స్ ఆయన్నే చూస్తున్నారు. ఈ ఫోటో బయటకు రాగానే ప్రభాస్ లుక్ ని షేర్లు చేస్తూ.. ఈ పిక్ లో వంగా మార్క్ బాడీ లాంగ్వేజ్ కనిపిస్తోంది అంటూ ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు.

మరోపక్క స్పిరిట్ నుంచి వచ్చిన ప్రభాస్ లుక్ ఒరిజినల్ కాదు, అది AI తో క్రియేట్ చేసిన ఫోటో అంటున్నారు. మరి ఈ విషయమై మేకర్స్ స్పందించాల్సి ఉంది.
 

Prabhas Spirit look leakedShocking Prabhas Spirit look leaked
Advertisement
Advertisement