Advertisement

పెద్ది - గౌర్ నాయుడు గా శివరాజ్ కుమార్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మచ్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’తో బాక్సాఫీస్‌ తుఫాన్ సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్సెస్‌లో చరణ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఇప్పుడు ఈ చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో మ్యాసీవ్ ప్రమోషన్స్ ప్రారంభమవుతున్నాయి.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో నిర్మాత వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ‘పెద్ది’ని భారతీయ సినిమాకు కొత్త అనుభూతిని ఇచ్చే విజువల్ స్పెక్టకిల్‌గా రూపొందించారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్‌ను మే 18న ముంబైలో గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు.

ఈలోగా మేకర్స్ మరో సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనని గౌర్నాయుడుగా పరిచయం చేస్తూ పవర్ఫుల్ వీడియో రిలీజ్ చేశారు.

ఈ వీడియోలో శివరాజ్ కుమార్ కుస్తీ బరిలో పవర్ ఫుల్ ప్రెజెన్స్ తో కనిపించడం అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ఆయన పాత్ర ఎంత పవర్ ల్ గా ఉండబోతుందో ఈ వీడియో తెలియజేస్తోంది.

Shiva Rajkumar as Gaur NaiduPeddi - Shiva Rajkumar as Gaur Naidu
Advertisement
Advertisement