Advertisement

ఫస్టొచ్చింది.. పెన్షన్ రాలేదు

Wed 01st May 2024 12:47 PM
pension  ఫస్టొచ్చింది.. పెన్షన్ రాలేదు
Pension ఫస్టొచ్చింది.. పెన్షన్ రాలేదు
Advertisement

గత ఐదేళ్లుగా నెల నెలా ఫస్ట్ తేదీ రాగానే అవ్వాతాతలని పలకరిస్తూ చేతిలో కరెన్సీ నోట్లు పట్టుకుని పెద్దమ్మా బాగున్నావా.. తాతా  బాగున్నావా అని పలకరించే వాలంటీర్ ఈ నెల ఒకటో తారీఖున రాలేదు.. వాలంటీర్ వచ్చి డబ్బులిస్తే మందులు.. పప్పు ఉప్పు.. సరుకులు కొనుక్కుందాం అనుకున్నాను.. కానీ వాలంటీర్ రాలేదు.. చేతిలోకి పైసలు పడలేదు. ఈ ఎండల్లో ఆటోల్లో పక్కూరు వెళ్లి బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకోవాలట. ఈ మండుటెండలో ఎలా వెళ్లాలో ఏమో అంటూ వృద్ధులు.. వికలాంగులు ఆందోళన చెందుతున్నారు. 

ఇదంతా చంద్రబాబే చేసాడని వైసీపీ నేతలే కాదు వృద్దులు సైతం అనుకుంటున్నారు. అసలు బ్యాంకులకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవడం మనకు అవుతుందా ? ఆ బ్యాంకుల్లో క్యూలైన్లు..నిలబడడం..ఆ ఫారాలు నింపడం.. ఇదంతా పెద్ద సమస్య.. దానికితోడు కొన్ని బ్యాంకులు తమ ఖాతాల్లో కనీస నిల్వ (మినిమమ్ బ్యాలెన్స్ ) లేకపోతె కొంత పెనాల్టీ విధిస్తాయి.

ఈ పేదల ఖాతాల్లో నిత్యం మినిమమ్ బ్యాలెన్స్ ఉంటుందా అనేది సందేహమే... అలా వాళ్ళు బ్యాలెన్స్ ఉంచకపోతే పాపం వీళ్ళ ఖాతాల్లోకి వచ్చిన మూడు వేలలో కొంత కోత విధిస్తే అది తమకు నష్టం అని వారు ఆందోళన చెందుతున్నారు. 

ఇదంతా చంద్రబాబు చేసిన కుట్ర అని, వాలంటీర్లు ఇల్లిల్లూ తిరిగి పెన్షన్లు పంచడాన్ని అయన భరించలేక ... సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి మంచిపేరు రావడాన్ని సహించలేక ఇలాంటి కుట్రలకు దిగారని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే.. జగన్ మంచి కోరే కొంతమంది వృద్దులు మాత్రం రేపు ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని అంటున్నారు

Pension:

Pension

Tags:   PENSION
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement