ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> The 7th season of Bigg Boss started with excellent ratings

బిగ్ బాస్ 7 కి అదిరిపోయే రేటింగ్

ఊహించినట్టుగానే బిగ్ బాస్ సీజన్ 7 ఎన్నో సంచలనాలకు వేదికైంది.  రేటింగ్స్ పరంగా, వ్యూయర్ షిప్ పరంగా ఊహించని ఎన్నో అద్భుతాలకు  స్టార్ మా లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 వేదిక గా నిలిచింది. సీజన్ సీజన్ కీ అపూర్వంగా పెరుగుతున్న ఆదరణ ఈ సీజన్ కి వచ్చేసరికి ఎన్నో రెట్లు పెరిగి తెలుగు టెలివిజన్ చరిత్ర లోనే సరికొత్త ప్రమాణాలను సృష్టించింది. తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఇద్దరిలో ఒకరు ఇప్పుడు  ఈ షో చూస్తున్నారు. 

ఇంచుమించు 5. 1 కోట్ల ప్రేక్షకులు మొదటి వారం బిగ్ బాస్ షో చూశారని గణాంకాలు చెబుతున్నాయి.  బిగ్ బాస్ సీజన్ 7 ఆవిష్కరణ కార్యక్రమాన్ని సుమారు 3 కోట్ల మంది ప్రేక్షకులు చూడడంతో గతంలో  క్రికెట్ మ్యాచ్ ల వీక్షణ పరంగా నమోదైన రికార్డు లను కూడా  తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 అధిగమించటం విశేషం. ఈ సీజన్  బిగ్ బాస్ ఎంతగా ఉర్రూతలూగించిందో చెప్పాలంటే  గత సీజన్ లో సాధించిన రేటింగ్ తో పోలిస్తే 40% అధిక రేటింగ్ నిదర్శనం అని చెప్పాల్సి ఉంటుంది. తిరుగులేని ఈ ప్రేక్షక ఆదరణతో ఇప్పటికే నెంబర్ వన్ స్థానంలో అప్రతిహతంగా దూసుకుపోతున్న స్టార్ మా... నెంబర్ 1 ఛానల్ గా తన స్థానాన్ని మరోమారు బిగ్ బాస్ సీజన్  సాక్షిగా వెల్లడించింది. 

ఈ సీజన్ ఉల్టా పల్టా గా ఉండబోతోంది అని కింగ్ నాగార్జున ప్రోమోలో చెప్పిన నాటి నుంచి విపరీతమైన అంచనాలు పెరిగాయి. అది ఈ గణాంకాలలో  కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 7 వీకెండ్ ఎపిసోడ్ ను సరాసరిన  7.1 % రేటింగ్ తో చూస్తే, మెట్రో నగరమైన హైదరాబాద్ లో అత్యధికంగా 8.7% రేటింగ్ తో వీక్షించడం విశేషం. తొలి వారం లోనే సంచలనాలకు కేరాఫ్ గా నిలిచిన  బిగ్ బాస్ సీజన్ 7 రాబోయే ఎపిసోడ్స్ లో ఇంకెన్ని  సంచలనాలు సృష్టించ నుందో ...!?  

ఈ షో కి  స్టార్ మా లో మాత్రమే కాదు .. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో, యూ ట్యూబ్ లో కూడా విపరీతమైన ఆదరణ వుంది.

The seventh season of Bigg Boss started with excellent ratings

The 7th season of Bigg Boss started with excellent ratings
bigg boss