ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ravi Teja 68th Film With Trinadha Rao Nakkina

ర‌వితేజ 68వ సినిమా సెట్.!

Ravi Teja 68th Film With Trinadha Rao Nakkina

మాస్ మహారాజా రవితేజ, త్రినాథ‌రావు న‌క్కిన కాంభినేష‌న్‌లో పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రం.

మాస్‌మ‌హారాజ ర‌వితేజ హీరోగా సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల ద‌ర్శకుడు త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొంద‌నుంది. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై ప్ర‌ముఖ నిర్మాత‌లు టి జి విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మిస్తున్నారు.  వివేక్ కూచిబొట్ల స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ర‌వితేజ 68వ సినిమాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ క‌థ‌, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమాలో న‌టించే ఇతర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు. ఈ సంక్రాంతికి విడుద‌లైన క్రాక్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకున్న ర‌వితేజ త్వ‌ర‌లో ఖిలాడి సినిమాతో మ‌న ముందుకు రానున్నారు. ఖిలాడి  మూవీ షూటింగ్ పూర్తి కాగానే ఈ చిత్రాన్ని ప్రారంభించ‌నున్నారు.

మాస్ మ‌హారాజా రవితేజ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రానికి.. బ్యాన‌ర్స్‌: పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్, నిర్మాత‌లు: టి జి విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, కో ప్రొడ్యూస‌ర్‌: వివేక్ కూచిబొట్ల‌,క‌థ‌, స్క్రీన్ ప్లే: ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ,  ద‌ర్శక‌త్వం: త్రినాథ‌రావు న‌క్కిన.

Ravi Teja 68th Movie Set!
ravi teja 68th film
trinadha rao nakkina
trinadha rao nakkina
producers tg vishwa prasad
abhishek agarwal
banner people media factory
abhishek agarwal arts
co producer vivek kuchibotla
ravi teja