ఈమధ్యన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగర్ సునీత రెండో పెళ్లి హాట్ టాపిక్ అయ్యింది. కోనేళ్ళుగా భర్త నుండి విడిపోయి తన పిల్లలతో విడిగా ఉంటున్న సునీత రామ్ వీరపనేనితో మళ్ళీ పెళ్లి పీటలెక్కింది. ఆమె ఎంగేజ్మెంట్ చాలా సింపుల్ గా జరిగినా పెళ్లి వేడుకలు, పెళ్లి పార్టీలు ఘనంగా జరిగాయి. సునీత పెళ్లి, ఆమె హనీమూన్ అన్ని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాయి. సునీత మళ్ళీ పెళ్లితో మరికొంతమంది తారామణుల రెండో పెళ్లి మేటర్ తెర మీదకి వచ్చింది. అందులో ముఖ్యంగా రెండేళ్ల క్రితం భర్తని కోల్పోయిన సురేఖ వాణి పెళ్లి ముచ్చట తెరపైకి వచ్చింది.
ఈమధ్యన సురేఖ వాణి కూతురు తో పాటుగా చిట్టి పొట్టి డ్రెస్సులతో డాన్స్ వీడియోస్ తో బాగా హైలెట్ అవుతుంది. చాలా సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి మంచి మంచి పాత్రలు సురేఖ వాణి రెండేళ్ల క్రితం అనారోగ్యంతో భర్త చనిపోవడంతో.. ఇప్పుడు కూతురు ప్రోత్సాహంతో మళ్ళీ పెళ్ళికి సిద్దపడినట్లుగా సోషల్ మీడియా కోడై కూస్తుంది. అయితే తన మళ్ళీ పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ జస్ట్ పుకార్లే అని.. అవన్నీ అవాస్తవాలంటూ తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదంటూ క్లారిటీ ఇచ్చేసింది. తాను మళ్ళీ పెళ్ళికి సిద్ధంగా లేనని.. తన పెళ్లిపై వస్తున్న వార్తలను ని కొట్టిపారేసింది.