కూటమి ఐక్యమత్యంపై పవన్ కళ్యాణ్ నమ్మకం
Pawan Kalyan's confidence in the alliance's unity
ఏపీలో కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బిజెపి ఐకమత్యం మొత్తం ఈ మున్సిపల్ ఇంకా స్థానిక సంస్థల ఎన్నికల్లో కోల్పోతుంది, జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు పై అలిగి రాజీనామా చేయబోతున్నారనే విషయంలో బ్లూ మీడియా, ఇంకా వైసీపీ చాలా గట్టిగా నొక్కి చెప్పింది, ఈ స్తానిక సంస్థల ఎన్నికల్లో జనసేన, టీడీపీ విడిపోతాయి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంకా జనసేన, బీజేపీలను మోసం చేస్తున్నారంటూ హడావిడి చేసింది. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఐక్య మత్యం, పటిష్టత గురించి చేసిన కామెంట్స్ తో వైసీపీ గొంతులో పచ్చి వెలక్కాయ పడడం ఖాయం.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కూటమికి తోడుగా నిలబడి అభివృద్ధి కి అండగా నిలవాలని ప్రతీ ఒక్కరినీ కోరుతున్నా
ఎమ్మెల్యే సీట్ల సర్దుబాటు కంటే స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు క్లిష్టంగా మారింది
సవాళ్లన్నింటినీ సీఎం అధిగమించి కలిసి వెళ్లేలా చొరవ తీసుకున్నారు
పైన ఉన్న ఐక్యతే కింది స్థాయిలో నూ ఉండాలి
2024 చాటిన ఐక్యతను మరోసారి బలంగా మూడు పార్టీలు చాటాలి
గత రెండున్నర ఏళ్లలో నా ఒక్క శాఖలోనే లక్షన్నర కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశాం
గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఎన్నో పథకాలు పునరుద్ధరించాం
స్థానిక సంస్థలు బలంగా ఉంటేనే గ్రామ స్వరాజ్యం సాధ్యం అని గుర్తించాలి
కూటమి అభ్యర్థులు ఐక్యం గా ఉండటమే ఇప్పుడు అసలైన సవాల్
గత ఎన్నికల్లో చాటిన 94శాతం స్ట్రైక్ రేట్ మళ్లీ రావాలి
టిక్కెట్ రాని వాళ్ళకి భవిష్యత్తు లో మంచి అవకాశాలు కల్పిస్తాం
క్షేత్రస్థాయిలో కూటమి స్ఫూర్తి కి ఎవ్వరూ విఘాతం కలిగించవద్దు
క్లిష్ట పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చి సమర్ధ నాయకత్వంలో ముందుకు వెళ్తున్నాం
ఎన్నో సవాళ్లు అధిగమించి ఇప్పుడు స్థానిక ఎన్నికలకు వెళ్తున్నాం
సీట్లు సర్దుబాటు, ఎన్నికల పర్యవేక్షణ చేస్తూనే తుఫాన్ ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం
ఎలాంటి నష్టం లేకుండా తుపాన్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సంసిద్ధం గా ఉంది
















































