దసరా కి మోక్షజ్ఞ మూవీ ఏమైంది

All set for Mokshagna debutAll set for Mokshagna debut


నందమూరి బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞ చిత్రం కోసం చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. గత రెండేళ్లుగా బాలయ్య మోక్షు సినిమా విషయంలో అలోచించి అలోచించి దర్శకుడిగా వశిష్ట ను ఎన్నుకున్నారు. వశిష్ట -మోక్షజ్ఞ కలయికలో తెరకెక్కనున్న చిత్రాన్ని బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

మోక్షు-వశిష్ట కాంబో పై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. మొన్న దసరాకి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఓపెనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే వార్త అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది. మొదటిగా అనౌన్స్ చేసిన ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోయినప్పుడు డిజప్పాయింట్ అయిన నందమూరి అభిమానులు ఇప్పుడు దర్శకుడు వశిష్ట పై నమ్మకం లేకపోయినా బాలయ్య పై నమ్మకంతో ఉన్నారు.

దసరా కి ఎలాగైనా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకుంటుంది, మోక్షు సెట్ పైకి వెళ్ళిపోతాడని కలలు కన్నారు. కట్ చేస్తే దసరా వెళ్ళిపోయింది. కానీ మోక్షజ్ఞ మూవీ మొదలు కాలేదు, కారణం వశిష్ట అని తెలుస్తుంది. వశిష్ట విశ్వంభర లోకం నుంచి బయటకు రాలేదు, ఈలోపు పూజ కార్యక్రమాలు చేస్తే బావుండదు అని ఆగినట్లుగా తెలుస్తుంది. 

Will Mokshagna make his Debut in 2026?