ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> YSRCP releases YS Jagan's letter to Sharmila

మేనకోడలు పెళ్లి కోసం ప్యాలెస్ ఇవ్వలేను: జగన్

YSRCP releases YS Jagan's letter to SharmilaYSRCP releases YS Jagan's letter to Sharmila

 

మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు మాజీ సీఎం జగన్, షర్మిల లు ఎప్పటి నుంచొ ఆస్తుల పంపకం విషయంలో గొడవలు పడుతున్నారు. ఇదంతా జగమెరిగిన సత్యమే. సొంత చెల్లికి జగన్ అన్యాయం చేసారని జనం అంటుంటే.. ఎప్పుడో ఆస్తుల పంచేసారు, ఇప్పుడు జగన్ పరువు తియ్యడానికి షర్మిల డ్రామా అంటూ వైసీపి నేతలు ఆరోపిస్తున్నారు.

ఇలాంటి సమయంలో షర్మిల తన కుమార్తె అంజలి వివాహాన్ని బెంగుళూరు లోని జగన్ ప్యాలెస్ లో చేయాలనుకోవడం, దానికి జగన్ అడ్డు చెప్పడం, ఇదంతా షర్మిల నీచమైన ప్లాన్ అని కొంతమంది, అయ్యో మేనకోడలు పెళ్ళికి ప్యాలెస్ ఇవ్వలేని మామ జగన్ అంటూ జగన్ ను తిట్టి పోసేవాళ్ళు కొంతమంది గత రెండు రోజులుగా ఇదే హాట్ టాపిక్ అయ్యింది.

అయితే జగన్ తన చెల్లెలు షర్మిలకు తన ప్యాలెస్ లో మేనకోడలు పెళ్లి ఎందుకు జరగకూడదు అనుకుంటున్నారో అనే విషయంలో వివరణ ఇస్తూ రాసిన లేఖను ఇప్పుడు వైసీపీ నేతలు బయట పెట్టడం చర్చనీయాంశం అయ్యింది. తన ప్యాలెస్ లో పెళ్లి జరిగితే భద్రతాపరమైన ఏర్పాట్లలో ఇబ్బందులు తలెత్తుతాయని, పెళ్లి కార్యక్రమానికి క్యాటరింగ్ సిబ్బంది, పూల డెకరేటర్లు, ఈవెంట్ మేనేజర్లు, ఫొటోగ్రాఫర్లతో పాటు వందలాది మంది ప్రజలు పెళ్లి లో పాల్గొంటారని దాని వలన భత్రతా సమస్యలు వస్తాయని జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు.

దానికి బదులు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ ఆస్తులను వాడుకోవాలని, లేదంటే రాజారెడ్డి వివాహం జరిగిన కన్వెన్షన్ సెంటర్ చూసుకోవాలని, తన మేనకోడలు అంజలి పెళ్లి ఎక్కడ జరిగినా ఆమె సంతోషంగా ఉండాలని జగన్ కోరుకుంటూ రాసిన లేఖ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

YS Jagan Letter To Sharmila