ఉపేక్షిస్తే లాభం లేదు.. మన గళం విప్పాలి

Pawan Kalyan

మొన్న అధికారంలోకి వస్తే సీఎం పదవి చంద్రబాబుకే అన్న నారా లేకేష్.. మరోసారి తన మనసులో మాట బయటపెట్టారు. ఒకవేళ ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం పదవి పవన్‌కు ఇస్తారా అన్న ప్రశ్నకు.. ఆ పదవి ఎవరికి ఇవ్వాలన్నది మా చంద్రబాబు, పొలిట్‌బ్యూరో నిర్ణయిస్తుంది అని తేల్చి చెప్పారు. 

ఇన్నాళ్లు  సీఎం సీఎం అని అరిచిన జనసైనికులు, ఆయనకు మద్దతిచ్చి కాపు నాయకులు కూడా ఇప్పుడు ఏం చేయాలన్నది తేల్చుకోవాల్సిన సమయం ఉంది. 

అందుకే నారా లోకేష్ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు పవన్‌ను సమర్థిస్తున్న కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య మరోసారి పవన్‌కు లేఖాస్త్రం సంధించారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక పరిణామాలు బాధకలిగిస్తున్నాయి. ఈ పరిణామాలు కాపు సామాజికవర్గ ఉనికికి ముప్పు తెచ్చేలా, మున్ముందు మనల్ని మరింత ఆత్మ రక్షణలో పడేసేలా ఉన్నాయి తప్ప కాపులకు ఏమాత్రం మేలు చేసేవిలా లేవు. 

ఇన్నాళ్లు లెక్కవేరు ఇక నుంచి వేరు. ఇప్పుడు మరోసారి చంద్రబాబు చేతిలో మోసపోవడానికి కాపులు సిద్ధంగాలేరు.

కాపులకు అండగా నిలబడతాడని భావించిన పవన్ చంద్రబాబు పంచన చేరి.. కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు.

కాపు సామాజికవర్గానికి పవన్ ఏదో చేస్తాడని నమ్ముతూ వచ్చాం. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆయనపై వస్తున్న ప్యాకేజీ ఆరోపణలు నిజమనిపిస్తున్నాయి.

పొత్తుతో ఉన్న పార్టీని సంప్రదించకుండా నారా లోకేష్ సీఎం అభ్యర్థి చంద్రబాబే అని ఎలా ప్రకటిస్తారు. బాబు అనుమతి లేకుండానే ఆయన ఈ ప్రకటన చేశారా? కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి బాబు చేస్తున్న కుట్ర ఇది.

ఈ విషయమై బహిరంగలేఖ రాసినా పవన్ గానీ, నాదెండ్ల గానీ ఇప్పటివరకు స్పందించలేదు. ఇది కాపులు ఆలోచించుకోవాల్సిన సమయం. 

పవన్ వైఖరి చూస్తుంటే జనసేనను టీడీపీలో విలీనం చేసేలా ఉంది. ఇక మనం ఉపేక్షిస్తే లాభం లేదు. 

ఇక మనం గళం విప్పాలి.. మన గొంతు వినిపించాలి..  పిడికిలి బిగించాలి. ఉనికిని కాపాడుకోవాలి. అధికారంలో మనవాటా మనం తీసుకోవాలి అంటూ హరిరామ జోగయ్య కాపులకు లేఖ రాశారు. 

హరిరామ జోగయ్య ఇలా లేఖాస్త్రాలు సంధిస్తున్న పవన్ కళ్యాణ్ గానీ, నాదెండ్ల మనోహర్ గానీ జనసేత తరుఫున మరెవరూ కూడా స్పందించడం లేదు. అంటే జోగయ్య లేవనెత్తిన అంశాలు వాస్తవమేని జనసైనికులు కూడా నమ్ముతున్నారు. ఈ వ్యవహారం జనసేనలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి

Hari Rama Jogayya

pawan kalyan