అదుపు తప్పుతున్న జనసైనికులు
Rayapati Aruna sensational comments on Megastar Chiruపవన్ కళ్యాణ్ అభిమానులు ఏకంగా చిరంజీవినే ప్రశ్నించే స్థాయికి చేరారా అంటే సోషల్ మీడియా చూస్తే అదే అనిపిస్తుంది. హీరోగా అభిమానుల్లో క్రేజ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ కి ప్రజల్లో రాజకీయంగా ఎంత బలముందో తేలడం లేదు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ కి ఆయన అభిమానుల నుండి ఎంత సపోర్ట్ ఉందొ అప్పుడే అర్ధమైంది. కానీ ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎలాగైనా గెలవాలనే తపనతో ప్రజల్లో తిరుగుతురన్నారు. ఇప్పుడుకూడా ఆయనకి అభిమానుల నుండి ఎంత సపోర్ట్ చేస్తారో తెలియదు కానీ.. ప్రస్తుతం జనసైనికులు పవన్ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నారా.. పవన్ వెనుక మహా వృక్షం లా ఉన్న చిరునే కించపరుస్తున్నారా అనేలా వారు అదుపు తప్పి మాట్లాడుతున్నారు.
పవన్ అభిమానులు ఇప్పుడు ఏకంగా చిరంజీవిని నిందించే స్థితికి వచ్చేసారు. పవన్ కళ్యాణ్‌ను ప్రజలు నమ్మకపోవడానికి, ఆయన్ను నాయకుడిగా చూడకపోవడానికి అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేయడమే కారణం అని సోషల్ మీడియాలో మొదటి నుంచీ యాక్టివ్ గా ఉండే రాయపాటి అరుణ అనే మహిళ చేసిన కామెంట్ ఇప్పుడు వివాదాస్పదం అయింది. ప్రజారాజ్యం విషయంలో చిరంజీవి నిర్ణయంతో ఇప్పుడు తమ పవన్ కళ్యాణ్‌ను ఎవరూ నమ్మడం లేదని, చిరంజీవి ఆనాడు పార్టీని విలీనము చేసి హాయిగా సినిమాలు చేసుకుంటూ ఉంటే తాము ఇప్పుడు బాధ పడుతున్నాం అన్నట్లుగా ఆమె చేసిన కామెంట్స్ కొత్త వివాదానికి తెర లేపాయి.
అసలు చిరంజీవి ప్రోత్సాహంతో పైకి వచ్చిన పవన్ కళ్యాణ్ పై జనసైనికులు నమ్మకాన్ని కోల్పోతున్నారన్నట్టుగా వారి తీరు కనిపిస్తుంది. అటు జనసైనికుల వ్యాఖ్యలకు చిరు అభిమానులు సైతం రిప్లై ఇస్తున్నారు. మా అన్నయ్యకు విలీనం చేయడానికి ఎమ్మెల్యేలు అయినా ఉన్నారు .. మీకు అదీ దిక్కులేదు, మీకు గెలవడం చేతగాక మా అన్నయ్యను అంటారా అంటూ చిరు అభిమానులు కౌంటర్లు వేస్తున్నారు.
ఇక చిరు ఫాన్స్ vs జనసైనికులు అన్న మాదిరిగా ముదిరిన ఈవ్యవహారాన్ని సద్దుమణిగేలా చేసేందుకు నాగబాబు నానా కష్టాలు పడుతున్నారు. లీవిట్.. వదిలేయండమ్మా.. రాయపాటి అరుణ తెలిసీ తెలీకుండా ఫ్లోలో అలా అనేసింది.. మొదటి నుంచి పార్టీలో ఉన్న మహిళా.. పట్టించుకోకండి అని అభిమానులని శాంతపర్చారు. కానీ ఈ విషయంలో మెగా అభిమానులు మాత్రం పవన్ పై, ఆయన ఫ్యాన్స్ పై గుర్రగా ఉన్నారు.
Mega fans vs Pawan fans







































