పవన్ గురించి జగన్ చెప్పేది నిజమేనా?

Is what Jagan says about Pawan true?

ఏపీలో రాజకీయ సమీకరణాలు ఆకాశాన్నంటుతున్నాయి. 2024 ఎన్నికల టార్గెట్ గా పలు రాజీయపార్టీలు బరిలోకి దిగేందుకు సన్నద్ధం అవుతున్నాయి. ఆ క్రమంలోనే ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. జగన్-చంద్రబాబు-పవన్ కళ్యాణ్-బీజేపీల మధ్యన మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇక పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి దత్తపుత్రుడు అంటూ సీఎం జగన్ పదే పదే విమర్శిస్తున్నారు. చంద్రబాబు కనుసన్నల్లోనే పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారంటూ జగన్ చెబుతూ వస్తున్నారు. ప్రస్తుతం వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వంపై తనని హత్య చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు.

దానికి వైసిపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ పైవిరుచుకుపడుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ను హత్య చేయటానికి లేదా అంతమొందించటానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఇదే పవన్ కళ్యాణ్ అప్పట్లో ఆరోపిస్తే .. ఇప్పుడు వారాహి యాత్రలో మాత్రం జగన్  ప్రభుత్వం మీద అవే ఆరోపణలు చేస్తున్నాడు. అయితే ఈ ఆరోపణలకు ఆధారాలు చూపించాలి. ఆధారాలు చూపించనట్లైతే పవన్ కల్యాణ్‌ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.. అంటూ డిమాండ్ చేస్తున్నారు..

పవన్ కల్యాణ్ కొద్దిరోజులుగా చంద్రబాబుని కలుస్తూ ఆయన ఇంటికి వెళ్లి మరీ సీట్లు, డబ్బుల ప్యాకేజీ మాట్లాడుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఏపీ యాత్రలో ఏ రోజు ఏం మాట్లాడాలో కూడా చంద్రబాబు ఇంటి నుంచి వస్తూనే ఉన్నాయి. నేను ఎమ్మెల్యే కావాలని మొదటి రోజు మాట్లాడగా.. సీఎం రేసులో పవన్ లేడని పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ నిరాశపడి వెనక్కి వెళ్లిపోతున్నారని అర్థంకాగానే.. ఎలాగూ టీడీపీతో కలిసే వెళ్తాడు కాబట్టి మీరు చేస్తే నేను ముఖ్యమంత్రి అవుతా అంటూ మరో డైలాగ్‌ కూడా టీడీపీయే పవన్ కల్యాణ్‌తో చెప్పించింది.. అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

అలాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో జగన్ కి వ్యతిరేఖంగా, పవన్ కి అనుకూలంగా కథనాలు ప్రసారం చేస్తున్న విషయంలోనూ వైసిపీ నేతలు మండిపడుతున్నారు.. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తికి ఆ పత్రికల్లో ప్రముఖంగా స్థానం ఇవ్వడం ఎంతవరకు సమంజసం అంటూ అడుగుతున్నారు. జగన్‌ ప్రభుత్వ పాలన మీద పవన్ కల్యాణ్‌ నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. ఈ వ్యాఖ్యల్లో నిజం ఉంటే.. పవన్ కల్యాణ్‌ ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేయొచ్చు కదా అని ఛాలెంజ్ విసురుతున్నారు. రాష్ట్రం మొత్తం మీద టీడీపీ చెప్పినట్లు సెలక్టివ్‌గా పోటీ చేసి తన సీటు కూడా తాను గెలవలేని వాడు వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీకి ఎన్ని ఓట్లు తగ్గుతాయో తన చిలకతోనో, ఎలకతోనో ఒక జ్యోతిష్యం చెప్పిస్తాడు. 

చంద్రబాబే పవన్ కి చేగువేరా. నారాజమిందారే చారుమంజుదార్. పుచ్చిన బుర్ర చంద్రయ్యే పుచ్చలపల్లి సుందరయ్య. ఆయన ఇచ్చే తీర్థం, ప్రసాదం, పుష్పం, ఫలం, గోదానం, భూదానం అన్నీ అందుకుని పార్టీ ఆఫీసు, వ్యక్తిగత సెటిల్‌మెంట్లు అన్నీ చేసుకున్నాడు కాబట్టే.. ఇప్పుడు ఈ నారా జమీందార్‌, ఈ చంద్రగువేరా అనేవాడు అత్యంత ప్రీతిపాత్రుడుగా కనిపిస్తున్నాడు.. అంటూ వైసిపీ నేతలు పవన్ పై సెటైర్స్ వేస్తున్నారు. ఎల్లో మీడియాను పిలుచుకుని వారికి ఏం కావాలంటే అది చెబుతాడు. వారు రాస్తారు.. వేస్తారు. 

మార్గదర్శిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలని ఏ న్యాయస్థానమూ అడ్డుకోదు. మార్గదర్శిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం జగన్‌ కి లేదు. నిజానికి, చంద్రబాబు హయాంలో ఓ చార్మినార్ బ్యాంక్, ఓ కృషి బ్యాంక్, గతంలో ఎత్తిపోతే 2014-19 మధ్య అగ్రిగోల్డ్ ఎత్తిపోవటానికి కారణం చంద్రబాబే అని వారు ఆరోపిస్తున్నారు. 

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అన్ని పార్టీలు ఏకం అవ్వాలని, కులాల పరంగా విడిపోవద్దని అన్నట్టుగా రాశారు. ఏపీలో జగన్ పాలన బాగోలేదనుకుంటే.. కూటములతో పనేంటి? 2019లో చంద్రబాబును రక్షించటానికి విడిగా వెళ్లిన పవన్ కల్యాణ్‌ తాను మునిగాడు తప్ప వ్యతిరేక ఓటు ఉన్నప్పుడు అధికార పార్టీని ఈ జిమ్మిక్కులతో ఓడించలేం కదా. వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు అంటూ ఒక డైలాగ్ అందుకున్నారు.

మూడు నాలుగు పార్టీలు కలసి రావాలని పవన్ కల్యాణ్‌ కోరుకుంటున్నాడు. అసలు ఈ పదేళ్లు ఏపీలోనే తన కుటుంబంతో వచ్చి ఒక్కరోజు కూడా లేనివాడికి ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని ఎవరైనా నమ్మితే.. ఇంతకన్నా అమాయకత్వం ఉంటుందా?.. అంటూ పవన్ కళ్యాణ్ జనసేనపై వైసిపీ నేతలు విరుచుకుపడుతున్నారు.

YCP Leaders Target on Pawan Kalyan

pawan kalyan