ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nasirr Khan remembers the legendary actor's remarkable journey

ఆ నవ్వుల వెనుక ఉన్న నిజ జీవిత విలువలు ఇవే!

Nasirr Khan remembers the legendary actor's remarkable journeyNasirr Khan remembers the legendary actor's remarkable journey

బాలీవుడ్ పరిశ్రమలో తనదైన శైలి నవ్వులతో కోట్లాది మందిని అలరించిన లెజెండరీ కమెడియన్ జానీ వాకర్ 100వ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు.. నటుడు నాసిర్ ఖాన్  తండ్రితో ఉన్న అనుబంధాన్ని, ఆయన నేర్పిన జీవిత పాఠాలను పంచుకున్నారు. `బాజీ`, `సి.ఐ.డి.`, `మిస్టర్ & మిసెస్ 55`, `ప్యాసా`, `మధుమతి` వంటి ఎవర్ గ్రీన్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన జానీ వాకర్  హాస్యనటుడిగానే కాకుండా మంచి మనసున్న మనిషిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు.

తండ్రి గురించి నాసిర్ ఖాన్ మాట్లాడుతూ.. `స్టార్‌డమ్ శాశ్వతం కాదు. అది వస్తుంది పోతుంది. కానీ మనం ఎలాంటి మనిషిగా జీవించామన్నదే ముఖ్యం` అని తన తండ్రి ఎప్పుడూ చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. పరిశ్రమలో శిఖరాగ్రాన ఉన్న సమయంలోనూ ఆయన ఎప్పుడూ సాదాసీదా జీవితాన్ని గడిపేవారని.. ఎవరినీ కించపరచకుండా స్వచ్ఛమైన హాస్యాన్ని అందించారని తెలిపారు. రీల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు అనే స్పష్టతతో జీవితాన్ని సాగించాలని  తనకు నేర్పినట్లు నాసిర్ పేర్కొన్నారు.

అలాగే కెరీర్ అత్యున్నత దశలో ఉన్న సమయంలోనూ  కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించడం కోసం జానీ వాకర్ సినిమాలను క్రమంగా తగ్గించుకుంటూ వచ్చారని నాసిర్ గుర్తు చేసుకున్నారు. కీర్తిప్రతిష్టలను, సంపాదనను పక్కనపెట్టి కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం అంత తేలికైన విషయం కాదని కానీ తన తండ్రి ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని ప్రశంసించారు. ఆయన సినిమాలు, పాటలు దశాబ్దాలు గడిచినా నేటితరానికి కూడా గుర్తుండిపోవడం గొప్ప విషయమని  ఆనందం వ్యక్తం చేశారు.

 

Nasirr Khan, who remembers the legendary comedian's values