రావణ్ గెటప్ కోసం యష్ మోసిన బరువు తెలిస్తే షాక్
Yash wore Ravana costumes weighing up to 33 kg in Ramayana
బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పాన్-ఇండియా విజువల్ వండర్ `రామాయణం` మొదటి భాగం మంచి టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా `రావణాసురుడి` పాత్ర పోషించిన యశ్ లుక్ - మేకోవర్ వెనుక ఆసక్తికర వివరాలు బయటకొచ్చాయి. ఈ సినిమా కోసం యష్ ధరించిన దుస్తులు, ఆభరణాల బరువు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
రావణాసురుడి పాత్రకు కాస్ట్యూమ్ అండ్ స్టైలిస్ట్‌గా వ్యవహరించిన సానియా సర్ధారియా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడూ యష్ ఆర్మర్ ..అవుట్‌ఫిట్ సవాళ్లను వెల్లడించారు. సినిమాలోని చాలా సన్నివేశాల్లో యష్ ధరించిన సాధారణ దుస్తులు .. జ్యువెలరీ బరువే 16 నుండి 20 కేజీల వరకు ఉండేదని తెలిపారు. తెరపై లంకేశ్వరుడి రాజసానికీ, అసుర చక్రవర్తి గంభీర్యానికి తగ్గట్టుగా డిజైన్లు రూపొందించినట్లు తెలిపారు.
కొన్ని ప్రత్యేకమైన సన్నివేశాల్లో యష్ వేసుకున్న కాస్ట్యూమ్స్ బరువు 30 నుండి 33 కేజీల వరకు పెరిగిందని కాస్ట్యూమ్ డిజైనర్ వెల్లడించారు. లంకలోని రాచరిక సన్నివేశాలు, వివాహ ఘట్టాలు , శూర్పణఖ పెళ్లి నేపథ్య సన్నివేశాల కోసం రూపొందించిన భారీ రాయల్ అవుట్‌ఫిట్స్ అత్యంత బరువైనవిగా నిలిచాయన్నారు. రావణాసురుడి కిరీటం 3D మోడల్స్ ద్వారా రకరకాల ప్రయోగాలు చేసి కిరీటం బరువును 1.8 కేజీల కంటే తగ్గించడం సాధ్యపడలేదన్నారు.
















































