ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Pawan and Anna's 13-Year Marriage Ends

పవన్-అన్నా కొణిదెల షాకింగ్ డెసిషన్

Pawan and Anna's 13-Year Marriage EndsPawan and Anna's 13-Year Marriage Ends

 

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన భార్య అన్నా కొణిదెల షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్-అన్నా కొణిదెల విడిపోతున్నట్టుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ షాకవుతున్నారు. పెళ్లి బంధం ముగిసినా ఎప్పటికీ మంచి స్నేహితులుగానే కొనసాగుతాం. బిడ్డల సంతోషం, వారి సంక్షేమమే మా మొదటి ప్రాధాన్యత..అంకితభావం కలిగిన తల్లిదండ్రులుగా ఉంటాము.

ఈ క్లిష్ట సమయంలో మా వ్యక్తిగత గోప్యతను గౌరవించండి. ఇన్నాళ్ల ప్రయాణంలో తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియా వేదికగా తాము విడిపోతున్నట్టుగా పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల సంచలన ప్రకటన చేసారు. పవన్ కళ్యాణ్ భార్యగా పవన్ వెన్నంటే కనిపించిన అన్నా కొణిదెల పవన్ తో విడిపోయారు.

డిప్యూటీ సీఎం గా పవన్ తో అధికారిక కార్యక్రమాలు, అలాగే ఆయన భుజానికి ఆపరేషన్ చేయించుకున్న సమయంలో సపోర్ట్ గా నిలిచారు అన్నా కొణిదెల. సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యి అత్తింటి తరుపు వారితో, భర్త తో కలిసి గడిపిన హ్యాపీ మూమెంట్స్ ని అభిమానులతో పంచుకున్నారు.

కొద్దిరోజుల క్రితంఅన్నా కొణిదెల ఇన్స్టా నుంచి వెళ్లిపోయారు. తాజాగా తాము విడిపోతున్నట్టుగా పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల ఒకేసారి ప్రకటించడమే అందరికి షాకిచ్చింది. 

Pawan Kalyan and Anna's 13-Year Marriage Ends