ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Fauzi: Prabhas and beautiful Imanvi are reportedly shooting

ఫౌజీ: వెడ్డింగ్ షూట్ లో ప్రభాస్

Fauzi: Prabhas and beautiful Imanvi are reportedly shootingFauzi: Prabhas and beautiful Imanvi are reportedly shooting


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ఫౌజీ డిసెంబర్ 3 నుంచి మార్చ్ 19 కి పోస్ట్ పోన్ అయిన విషయం తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ లో ప్రభాస్ ఇమాన్వి తో రొమాన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఫౌజీ చిత్రం పై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఫౌజీ సెట్ లో వెడ్డింగ్ షూట్ జరుగుతుంది.

ప్రభాస్ అలాగే ఇమాన్వి పై పెళ్లి ఘట్టాలను హను రాఘవపూడి చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటిలో వేసిన భారీ సెట్ లో ప్రభాస్, ఇమాన్వి లపై ఈ పెళ్లి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 1940 నాటి ఆచార వ్యవహారాలతో ఈ పెళ్లి సన్నివేశాలను హను షూట్ చేస్తున్నారని, ఈ సన్నివేశాలు ఫౌజీ కి హైలెట్ కానున్నాయని చిత్ర బృందం చెబుతుంది.

మరి హను రాఘవపూడి ప్రేమ కథలను, దాని చుట్టూ జరిగే సన్నివేశాలను ఎంత బ్యూటిఫుల్ గా చిత్రీకరిస్తారో అనేది సీతారామం చూసినవాళ్లకు తెలుస్తుంది. అందుకే ఈ పెళ్లి సన్నివేశాలపై అందరిలో అంత క్యూరియాసిటీ కనిపిస్తుంది. 

Prabhas back to the Sets of Fauzi in Ramoji Film City