BB10: మబ్బేష్ అంటూ రెచ్చిపోయిన శివ్
Bigg Boss Telugu 10 : Shiv vs Mukhesh Gowda
ఏదైనా బిగ్ బాస్ లో ఈ సీజన్ లో కామనర్ రోహిత్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మామూలుది కాదు. అగ్నిపరీక్ష తో సత్తా చాటి అభిమానులని పోగేసుకుని హౌస్ లోకి వచ్చిన రోహిత్ నాయుడు ని సెలెబ్రిటీ కోటాలో వచ్చిన త్రిగుణ మొదటి రెండు వారాలు చాలా ఏడిపించాడు. ఆ రెండు వారాల్లో రోహిత్ ఆట బావుంది. కానీ మూడో వారం నుంచి రోహిత్ త్రిగుణ ని టార్గెట్ చెయ్యడం, షాలిని తో కలిసి టాస్క్ లు పట్టించుకోపోయినా రోహిత్ అభిమానులు ఆయన్ను బాగా ఆదరించారు.
కానీ రోహిత్ హౌస్ సపోర్ట్ లేక మిడ్ వీక్స్ లో ఎలిమినేట్ అవడంతో హౌస్ లో గొడవలు ఆగిపోయాయి. ఆడియన్స్ లోను ఆసక్తి సన్నగిల్లింది. ఆతర్వాత ముఖేష్-త్రిగుణ నడుమ రచ్చ కనిపిస్తున్న త్రిగుణ ముందు ముఖేష్ తేలిపోతున్నాడు తప్ప రోహిత్ లా త్రిగుణ ని తట్టుకుని నిలబడలేకపోతున్నాడు. ఆటలో మేటి మాట్లాడడంలో ముఖేష్ మాట సరిపోవడం లేదు.
అందులో బయట కూడా ముఖేష్ ను మబ్బు, మబ్బేష్ అంటున్నారు. అదే మాట ఈరోజు నామినేషన్స్ లో శివ్ ముఖేష్ ని అనడం హైలెట్ అయ్యింది. శివ్ తనని దేబ్జానీ కలిపి మాట్లాడి ఫ్రాంక్ అనడం కరెక్ట్ కాదు.. అనగానే సుధీర్ లేచి ఆయనంటే క్లారిటీగా చూసుకుంటే గుండు సున్నా చూసుకోండి అనగానే శివ్ మీరు మబ్బుల్లో ఉన్నారు, మబ్బుల్లో తేలి ఉన్నారు, మీరు ముఖేష్ కాదు మబ్బేష్ అంటూ రెచ్చిపోయాడు.
ఈ నామినేషన్స్ లో సుధీర్ ముఖేష్ గొడవ హైలెట్ అయ్యింది. మేము మా ఫ్యామిలీ లేకపోతె నువ్వు కంటెండర్ కాదు కదా కెప్టెన్ కూడా అయ్యేవాడివి కాదు అంటూ ముఖేష్ సుధీర్ ని టార్గెట్ చేసాడు.
















































