విశ్వక్ సేన్.. జర ఆలోచన చేస్తే బెటర్
Cult Result: Vishwak Sen's Film Is a Disaster
యువ హీరోలంతా సక్సెస్ కోసం పరుగులు పెడుతున్నారు. విశ్వక్ సేన్ కూడా వరస సినిమాలు చేస్తున్నారు. కానీ విజయమే విశ్వక్ సేన్ దరి చేరడం లేదు. లైలా అంటాడు, కల్ట్ అంటాడు.. మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తాడు. కానీ విపరీతమైన రక్తపాతం వలన హీరోలు ఎంతగా నష్టపోయారో రీసెంట్ టైమ్స్ లో చాలా సినిమాలు నిరూపించారు.
విశ్వక్ సేన్ నుంచి తాజాగా వచ్చిన కల్ట్ సినిమా సాధారణ ప్రేక్షకుడికి అస్సలు నచ్చలేదు. దర్శకుడిగా హీరోగా కల్ట్ తో విశ్వక్ సేన్ ఫెయిల్ అయ్యాడనే మాట ఆడియన్స్ నోట వినిపిస్తుంది. ఈ చిత్రం స్క్విడ్ గేమ్ కి రీమేక్ ఆ అంటూ కామెంట్లు పెడుతున్నారు. బూతు డైలాగ్స్ వాడి, యాక్షన్ చూపించేస్తే మాస్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారనుకుంటే.. అంతకుమించిన పొరబాటు మరొకటి
లేదు.
హీరోగా విశ్వక్ పోలీస్ పాత్రలో పెద్దగా ఎఫెక్టీవ్ గా కనిపించలేదు, దర్శకుడిగా కూడా విశ్వక్ ఇంప్రెస్స్ చెయ్యలేకపోయాడు. బూతు డైలాగ్స్ తో చిరాకు తెప్పించిన విశ్వక్ సేన్ యాక్షన్ అందులోను రక్తపాతంతో జుగుప్స కలిగించడంతో ఆడియన్స్ విశ్వక్ సేన్ ని సోషల్ మీడియాలో ఉతికి ఆరేస్తున్నారు.
అటు క్రిటిక్స్ కూడా పూర్ రివ్యూస్, చెత్త రేటింగ్స్ విశ్వక్ సేన్ కల్ట్ మూవీ కి ఇచ్చారంటే సినిమా ఎలా ఉందొ, ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అనేది కల్ట్ థియేటర్స్ చూస్తే అర్ధమవుతుంది. అసలు వీకెండ్ తర్వాత కల్ట్ సౌండ్ లేదు. విశ్వక్ సేన్ ఇప్పటికైనా ఆలోచించి అడుగు వేయడం బెటర్ అని ఆయన అభిమానులే చెబుతున్న మాట.
















































