BB10: రెడ్ బ్యాచ్ కి నాగ్ మాస్ వార్నింగ్
Bigg Boss Telugu 10 : New Promo Review
శనివారం వచ్చేసింది, హోస్ట్ నాగార్జున వచ్చేసారు. ఈ వారం అందరూ పర్లేదు, మాటలు కంట్రోల్ లో ఉన్నారు, ఎవరికి వచ్చింది వాళ్ళు ఆడారు. సో ఈ వారం నాగార్జున ఏ కంటెస్టెంట్ ని టార్గెట్ చెయ్యరు. మరి శనివారం ఎపిసోడ్ చప్పగా ఉంటుంది అనుకున్న ప్రేక్షకులకు నాగార్జున ట్విస్ట్ ఇస్తూ నో స్టార్స్ అంటూ కంటెస్టెంట్స్ ని టార్గెట్ చేసారు.
సుధీర్ రెండు వారాలుగా నీ అట లేదు, రెడ్ లోనే ఉన్నావ్ అనగానే సర్ నేను ఓ టాస్క్ లో మూడో ప్లేస్ లో ఉన్నా అన్నాడు. అవన్నీ అనవసరం నువ్ రెడ్ లో ఉన్నావా, లేదా అన్నారు, ఇక ఝాన్సీ ని లేపి నువ్ రెడ్ లో ఎందుకు ఉన్నావో తెలుసా అని నరేష్ తో ఆమె ఆడిన ఫౌల్ గేమ్ వీడియో వేసి చూపించారు, ఇలా ఆడితే ఇక రెడ్ లోనే ఉంటావ్ అన్నారు.
రామకృష్ణ జాలీగా ఆడు, జాలిగా ఆడకు అంటూ అతనికి వార్నింగ్ ఇచ్చారు. ఇక నీతూ మాస్టర్ మీకు ఈ వారం స్టార్ లేదు.. కోచ్ పని మానేసి ఎంపైర్ పని మొదలు పెట్టారా అంటూ నీతూ మాస్టర్ గేమ్ గురించి మాట్లాడారు. నేను ఎలా ఆడినా బాల్ పడిపోతుంది అంటే కారణాలు చెప్పొద్దమ్మా అంటూ నీతూ మాస్టర్ కి నో స్టార్స్ అంటూ వార్నింగ్ ఇచ్చిన ప్రోమో వచ్చేసింది.
















































