ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> RC17: All set for launch, suspense over female lead continues

RC17: ఎక్సక్లూసివ్ లన్ని తుస్సుమన్నాయి

RC17: All set for launch, suspense over female lead continuesRC17: All set for launch, suspense over female lead continues


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-సుకుమార్ కలయికలో రేపు నవంబర్ 1 నుంచి పూజా కార్యక్రమాలతో మొదలు కాబోతున్న RC17 చిత్రం హీరోయిన్ విషయంలో సోషల్ మీడియాలోనే కాదు.. కొంతమంది సినీజర్నలిస్టు లు ఎక్సక్లూసివ్ అంటూ ఒకసారి సారా అర్జున్ ని చరణ్ కి జోడిగా తీసుకొచ్చారు.

ఆతర్వాత భాగ్యశ్రీ బోర్సే అన్నారు. ఆతర్వాత ప్రీతి ముకుందన్ పేరు తెరపైకి వచ్చింది. అంతెందుకు కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ పేరుని కూడా తెరపైకి తెచ్చారు. ఈరోజు కొత్తగా ఎక్సక్లూసివ్ అంటూ రామ్ చరణ్ కి జోడిగా RC17 ప్రాజెక్ట్ కోసం దర్శకుడు సుకుమార్ సాత్విక వీరవల్లి ని ఫైనల్ చేసారంటూ రకరకాల హీరోయిన్స్ పేర్లు RC17 కోసం చక్కర్లు కొట్టాయి.

కానీ RC17 విషయంలో ఏ ఎక్సక్లూసివ్ హీరోయిన్ నిజం కాదని, అసలు ఇప్పటివరకు సుకుమార్ ఏ హీరోయిన్ ని రామ్ చరణ్ కోసం సంప్రదించలేదని తెలుస్తుంది. రేపు పూజా కార్యక్రమాలతో మొదలు కాబోయే RC17 రెగ్యులర్ షూట్ మాత్రం జనవరి లేదా, ఫిబ్రవరి నుంచి మొదలవుతుంది అని సమాచారం. 

RC17: All set for launch