ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Arnab’s tension over Aadarsha Kutumbam and Cult films

ఆదర్శం-కల్ట్ చిత్రాలకి అర్నాబ్ టెన్షన్

Arnab’s tension over Aadarsha Kutumbam and Cult filmsArnab’s tension over Aadarsha Kutumbam and Cult films


ప్రస్తుతం కోనసీమ జిల్లాలు అర్నాబ్ తుఫాన్ తో వణికిపోతున్నాయి. అర్నాబ్ తుఫాను గాలులకు చెట్లు పడిపోతున్నాయి, సముద్ర తీరప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. కాకినాడ, యానాం, నరసాపురం, వైజాగ్ అన్ని అర్నాబ్ ఎఫెక్ట్ తో అల్లాడుతున్నాయి. ఈరోజు తీరం దాటనున్న అర్నాబ్ తుఫాను ఎఫెక్ట్ ఏపీలోని పలు జిల్లాలకు తాకింది.

ఈదురుగాలులతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం, నరసాపురానికి 30 కిలోమీటర్ల దూరంలోనే తుపాను కేంద్రీకృతం అవడంతో నరసాపురంపై ఈ తుఫాను ఎఫక్ట్ తీవ్రంగా కనిపిస్తుంది. మధ్యాహ్నానికి తుపాను పూర్తిగా తీరం దాటే అవకాశం ఉంది. సముద్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు, వర్షాలతో భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి.

ఇలాంటి సమయంలో రేపు శుక్రవారం విడుదల కాబోతున్న ఆదర్శ కుటుంబం, కల్ట్ చిత్రాలకు ఈ అర్నాబ్ తుఫాను తో టెన్షన్ మొదలయ్యింది. విద్యుత్ లేక, చెట్లు పడిపోయి, వర్షాలతో కోనసీమ జిల్లాలే కాదు, అల్లూరు, ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు జిల్లాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. మరి ఈ రెండు చిత్రాలు బాక్సాఫీసు దగ్గరకు వస్తున్న తరుణంలో అర్నాబ్ వలన ఏమైనా ఎఫక్ట్ పడుతుందా అని భయపడుతున్నారు.

ఈరోజూ అర్నాబ్ ఎఫెక్ట్ ఉంటుంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ అర్నాబ్ ఎఫెక్ట్ ఆదర్శ కుటుంబం, కల్ట్ ఓపెనింగ్స్ పై పడేలా కనిపిస్తుంది. 

Tollywood BO: Worst Situation This Weekend?