ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Will Megastar decide when things happen?

ఏది ఎప్పుడ‌న్న‌ది అన్న‌య్య డిసైడ్ చేస్తారా?

Will Megastar decide when things happen?Will Megastar decide when things happen?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల విడుదల తేదీలపై నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా సంక్రాంతి బరిలో ఏ సినిమాను నిలబెట్టాలనే విషయంలో చిరంజీవి సమగ్రమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం లైన్‌లో ఉన్న `విశ్వంభర`,`కాకా` చిత్రాలలో సంక్రాంతి పండుగ రేసులో ఏది దిగాలనేది పూర్తిగా అన్నయ్య నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.

సాధారణంగా పండుగ సీజన్.. ముఖ్యంగా సంక్రాంతి సమయానికి థియేటర్ల లభ్యత , ప్రేక్షకుల అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ నేప‌థ్యంలో రెండు సినిమాల షూటింగ్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నా? తొందరపడి విడుదల తేదీని ఖరారు చేయకూడదని భావిస్తున్నారు. రెండు చిత్రాల ఫైనల్ అవుట్‌పుట్  పూర్తిగా సిద్ధమైన తర్వాతే రష్‌స్ చూసి కంటెంట్ పరంగా పండుగ రేసుకి ఏ సినిమా పర్‌ఫెక్ట్‌గా సరిపోతుందో చిరంజీవి నిర్ణయించనున్నారుట‌.

విజువల్ ఎఫెక్ట్స్ .. సోషియో ఫాంటసీ అంశాలతో తెరకెక్కుతున్న `విశ్వంభర` ఒకవైపు మాస్  పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న `కాకా` మరొకవైపు ఉండటంతో మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అవుట్‌పుట్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా విఎఫ్‌ఎక్స్ నాణ్యత , ఎడిటింగ్ పూర్తిస్థాయిలో సంతృప్తినిచ్చిన సినిమాకే సంక్రాంతి విడుదలకు మొదటి ప్రాధాన్యత లభించనుంది. మిగిలిన చిత్రాన్ని త‌దుప‌రి స‌రైన  డేట్‌కు రీ-షెడ్యూల్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారుట‌.

Vishwambhara vs Kaaka